కర్నూలు: ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి.. పారిపోయిన వైద్యులు, సిబ్బంది

By Siva KodatiFirst Published May 1, 2021, 3:25 PM IST
Highlights

దేశంలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ కంటే కూడా వైద్యం లభించక మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కర్నూలులో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మరణించారు.

ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ ఆసుపత్రి యాజమాన్యం కరోనా చికిత్సను చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన నేపథ్యంలో యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది ఆసుపత్రిని వదిలి పారిపోయారు. 

Also Read:ఏపీలో రాకెట్ వేగంతో కరోనా: కొత్తగా 17,354 కేసులు.. సెకండ్‌వేవ్‌లోనే అత్యధికం, చిత్తూరులో భయానకం

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కోరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ కేసులు నిన్న 17 వేల మార్క్‌‌ను దాటాయి. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు చోట్ల మినీ లాక్‌డౌన్ విధించగా, ప్రస్తుతం రాష్ట్రం మొత్తం నైట్ కర్ఫ్యూ అమల్లో వుంది.

అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో రావడం లేదు. శుక్రవారం కొత్తగా 17,354 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 11,01,690కి చేరుకుంది. నిన్న కోవిడ్ వల్ల 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ సోకి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,992కి చేరింది. 
 
click me!