
వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ సేవల్ని వైసీపీకి వినియోగించుకోవడం లేదన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గత ఎన్నికల తర్వాత పీకే, ఐపాక్ సంస్థతో ఒప్పందం ముగిసిందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికలకు థర్డ్ పార్టీ ద్వారా సర్వే చేయిస్తామని సజ్జల చెప్పారు.
కాగా.. ప్రశాంత్ కిషోర్.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో పీకే టీమ్ కీలక పాత్ర పోషించింది. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీల కోసం పనిచేశారు. అయితే.. ప్రశాంత్ కిషోర్ .. తాజాగా కాంగ్రెస్ తో కలిసి అడుగులు వేయబోతున్నారు. దీంతో రాబోయే ఎన్నికలకు ఆయన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం ప్రారంభమైంది. అలాగే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో డీఎంకేతో (dmk), పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) , మహారాష్ట్రలో ఎన్సీపీతో (ncp) , జార్ఖండ్‌లో జేఎంఎంతో (jmm) కలిసి వెళ్లాలని చెప్పారట. తెలంగాణలో విడిగా పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ తరుణంలో తాజాగా ఈ పొత్తుల అంశాలపై పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి (vijayasai reddy) కారిటీఇచ్చారు. ప్రశాంత్ కిశోర్ పార్టీ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినేత చూసుకుంటారని ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఏయూ వై వి ఎస్ ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమం అనంతరం మీడియా తో మాట్లాడారు. తాను ఏ రోజు ఏ పదవి కోరుకోలేదని, పార్టీ అధినేత గా జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నిర్వర్తించడం తన కర్తవ్యం అన్నారు. వైసిపి క్రియశిల సభ్యుడిగా నుంచి రాజ్య సభ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నేత గా, ఇప్పుడు అనుబంధ సంఘాల క్రియాశీల నాయకుడిగా నా భాధ్యతను నిర్వహిస్తున్నని తెలిపారు.
మరోవైపు... ఎన్నికల దిశగా సీఎం జగన్ (ys jagan) కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 27న తాడేపల్లిలో జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. మంత్రులు , పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు టార్గెట్ 2024పై (ap assembly session 2024) దృష్టి సారిస్తూ.. పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (prashant kishor) ఏపీ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాడనే ఉహాగాహాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో అధికార వైసీపీతో కాంగ్రెస్ పొత్తు (ysrcp congress alliance) ఉంటుందని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పొత్తు అసలు ఇది సాధ్యమా? అసాధ్యమా? మాట పక్కన పెడితే.. ఈ ఊహాగానాలతో ఏపీ పొలిటికల్ హీట్ ను అమాంతం పెరిగింది.