ఆమె నిర్ణయాలపై మేం స్పందించం.. కానీ షర్మిల అరెస్ట్ బాధాకరం : సజ్జల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 29, 2022, 2:51 PM IST
Highlights

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆమె రాజకీయ నిర్ణయాలపై తాము స్పందించబోమన్నారు. 

హైదరాబాద్‌లో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై స్పందించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. అయితే షర్మిల రాజకీయ నిర్ణయాలపై తాము వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 

రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్‌కు తగ్గట్టే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని సజ్జల తెలిపారు. ఈ మేరకే మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయని ఆయన అన్నారు. ప్రభుత్వం రాజధాని అంశంలో ఒక నిర్ణయం తీసుకుందని.. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు చేసిందని సజ్జల తెలిపారు. రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామన్న ఆయన.. రాజధాని అంశం ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఒప్పందం కాదన్నారు. మూడు రాజధానులతో వికేంద్రీకరణ చర్యలు తీసుకుంటున్నామని.. ఇవాళ్టీ వరకు అమరావతే రాజధాని అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 

ఇక వైఎస్ వివేకా కేసు గురించి సజ్జల స్పందిస్తూ.. ఆయన వైసీపీ నాయకుడని, సీఎం జగన్‌కు చిన్నాన్న అని చెపే్పారు. ఈ కేసులో రాజకీయాలు వుండవని, అయితే వివేకా కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ కుట్రలు చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అంతిమంగా నిజానిజాలు తెలియాలన్న ఆయన... తెలంగాణలో విచారణ జరిగితే ఇంకా మంచిదన్నారు. ఈ విషయంలో మాకు ఎలాంటి భయాలు, దాపరికాలు లేవని సజ్జల పేర్కొన్నారు. వివేకాను హత్య చేసిన దోషులకు కఠిన శిక్ష పడాలని రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. 

click me!