పాలన చేతకానిది ఆయనకే , అందుకే జనం బై బై చెప్పేశారు : చంద్రబాబుకు సజ్జల కౌంటర్

By Siva KodatiFirst Published Nov 24, 2022, 5:20 PM IST
Highlights

ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనకు పాలన చేతకాలేదు కాబట్టే జనం బై బై చెప్పేశారని సజ్జల ఎద్దేవా చేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పాలన చేతకాదని, అందుకే బై, బై అంటూ ప్రజలు ఆయనను ఇంటికి పంపారని సెటైర్లు వేశారు. తనకు తానే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఒప్పుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. పులివెందులపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు భూమి ఇచ్చిన వారిలో ఎవరి ఇల్లు కూలిందో పేర్లు ఇవ్వమంటే పవన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని సజ్జల నిలదీశారు. వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్ ఇద్దరూ మంచి నాయకులేనని రామకృష్ణారెడ్డి అన్నారు. కింది స్థాయిలో అపోహలు వుంటే తొలగించుకోవాలని సూచించానని ఆయన తెలిపారు. 

అంతకుముందు.. ఏపీలో ఆక్వారంగ పరిస్థితులపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో 'ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ' పేరుతో నిర్వహించిన సదస్సులో టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు టిడిపి ప్రభుత్వం ఎలా సహాయం అందించిందో... వైసిపి ప్రభుత్వం ఎలా దోచుకుంటోందో చంద్రబాబు వివరించారు. వైసిపి ప్రభుత్వ చేతగాని పాలనకు ఆక్వా రంగం, రైతులు బలయిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగితే సమస్యలు పరిష్కారం కావని... సరయిన నిర్ణయాలతోనే సమస్యలను దూరం చేసుకోవచ్చని ఇప్పటికైనా జగన్ గుర్తిస్తే మంచిదని చంద్రబాబు అన్నారు. 

ALso REad:చేతగాకపోతే రాజీనామా చెయ్... నేను చూసుకుంటా..: జగన్ కు చంద్రబాబు సవాల్

వైసిపి అధికారంలోకి వచ్చాక ఒక్క ఆక్వారంగమే కాదు ప్రతి రంగంమూ సంక్షోభంలో నెట్టివేయబడిందని చంద్రబాబు అన్నారు. ఏ సమస్యనూ వైసిపి పాలకులు పరిష్కరించలేకపోతున్నారని అన్నారు. 'మీకు చేతకాకుంటే రాజీనామా చేసిపొండి.... నేను ఎలా పరిష్కరిస్తానో చూడండి' అంటూ చాలెంజ్ విసిరారు. ప్రభుత్వ పెద్దల అవినీతే ఆక్వా రంగాన్ని నిండా ముంచుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. టన్ను ఆక్వా ఫీడ్ కు రూ.5 వేల చొప్పున ఉత్పత్తిధారుల నుండి వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందని అన్నారు. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బులను ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ఉపయోగించాలని వైసిపి చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు,

click me!