
పట్టాభి అన్న మాటలో తప్పు లేదనుకుంటే అమిత్ షాను (amit shah) అదే పదంతో పలకరించగలరా అని వైసీపీ (ysrcp) ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . అమిత్ షాను అలాగే పలకరిస్తే తాము క్షమాపణలు చెబుతామని సజ్జల సవాల్ విసిరారు. చంద్రబాబుది (chandrababu naidu) 36 గంటల దీక్ష అనేకన్నా 36 గంటల డ్రామా అనొచ్చు అంటూ సెటైర్లు వేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెన్నాయుడికే ఆ దీక్ష ఎందుకో తెలియదని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారంతా దాడులు చేస్తామంటూ సవాళ్లు విసిరారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాళ్లంతా ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసినవారేనని ఆయన తెలిపారు.
బూతులు మాట్లాడుతూ ఎవరైనా నిరాహార దీక్ష చేస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. 72 ఏళ్ల డయాబెటిక్ పేషెంట్ గంటన్నర పాటు ఆవేశంగా ఎలా మాట్లాడగలిగాడని ఆయన ప్రశ్నించారు. 36 గంటల దీక్ష చేస్తే నీరసం రాదా అని సజ్జల నిలదీశారు. దీక్షలో చందాలు ఇవ్వడం ఏంటో..? అదేమైనా ప్లీనరీనా అని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. దీక్షలో కూడా రాజకీయ లక్ష్యం కూడా కనిపించలేదని ఆయన ధ్వజమెత్తారు. బూతును సమర్థిస్తూ దాని మీద ఉద్యమానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు దీక్ష చేశారని సజ్జల ఆరోపించారు. ప్రపంచంలో ఎవరూ ఇలా చేయరని.. బూతులు మాట్లాడటం నా హక్కు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారన్నారు.
ALso Read:ఢిల్లీకి చేరిన ఏపీ పంచాయతీ: రాష్ట్రపతి అపాయింట్‌మెంట్.. సోమవారం హస్తినకు చంద్రబాబు
పట్టాభి (kommaredy pattabhi) అన్న మాట వినలేదని చంద్రబాబు అంటున్నారని.. ప్రజలను ఆయన వెర్రివాళ్లు అనుకుంటున్నాడా అని సజ్జల ఫైర్ అయ్యారు. గాంధేయవాదం పేరుతో బూతులు మాట్లాడారని.. ఇబ్బందికరంగా వున్నా రాజకీయాలు మరింత దిగజారకూడదనే చెబితే, దానిని ఎగతాళి చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రావు కాబట్టి వాటి నుంచి తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ (ys jagan) రివ్యూ చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారని.. దాని కోసం ప్రత్యేకంగా ఎస్ఈబీనే ఏర్పాటు చేశారని సజ్జల స్పష్టం చేశారు. మీ లాగా బెల్టు షాపులు పెట్టలేదని.. గంజాయి రవాణాపై ఎస్ఈబీ ఉక్కుపాదం మోపుతోందని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలోనే గంజాయి దందా జరిగిందని... ఆయన అంటేనే పెద్ద అబద్ధమని సజ్జల అభివర్ణించారు.
రాష్ట్రంలో విద్వేషం సృష్టించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే అధికార ప్రతినిధితో బూతులు తిట్టించారని.. టీడీపీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని సజ్జల పిలుపునిచ్చారు. మా పార్టీ తరపున సంయమనం పాటిస్తామని.. చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దాడులను ఈ ప్రభుత్వం ప్రోత్సహించదని.. అర్జెంట్‌గా అధికారంలోకి రావాలని చంద్రబాబు కోరిక అంటూ సజ్జల సెటైర్లు వేశారు. టీడీపీ లాంటి పార్టీలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని.. ఈ విషయంపై మా ఎంపీలు ఎన్నికల కమీషన్‌ను కలుస్తారని సజ్జల తెలిపారు. ఈ ఏడాదడి 2 లక్షల 93 వేల కేజీల గంజాయి పట్టుకున్నారని... గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌కు ఏపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అబద్ధపు వ్యక్తి అని జాతీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నామని రామకృష్ణారెడ్డి తెలిపారు.