టీడీపీ నేతలపై దాడులు, మేం ఆధారాలిస్తాం.. మీ యూనిఫాంలు తీసేయండి: పోలీసులపై చంద్రబాబు ఫైర్

By Siva KodatiFirst Published Oct 22, 2021, 8:18 PM IST
Highlights

పార్టీలపైనా, నేతలపైనా పోలీసుల్ని ప్రయోగిస్తున్నారని టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ (telugu desam party) కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేశారు

పార్టీలపైనా, నేతలపైనా పోలీసుల్ని ప్రయోగిస్తున్నారని టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ (telugu desam party) కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇది ప్రజా దేవాలయమని ఆయన చెప్పారు. డీజీపీ ఆఫీసులకు వంద గజాల దూరంలోనే దాడి జరిగిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. డీజీపీ (ap dgp) అనుకుని వుంటే ఇది జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. ఇది ఉగ్రవాదం కాక మరేమిటని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయని.. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా మమ్మల్ని వేధించారని చంద్రబాబు ఆరోపించారు. 

పిల్లల భవిష్యత్ నాశనం అయ్యేలా డ్రగ్స్ (drugs) వినియోగం జరుగుతోందని.. డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌గా మారిందని ఆయన ఆరోపించారు. పోలీసులు, అధికార యంత్రాంగానికి భయపడి తాము సరెండర్ కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం చేస్తుందని.. దశలవారీగా మద్యనిషేధం విధిస్తామని ప్రభుత్వం చెప్పిందా, లేదా అని ఆయన నిలదీశారు. తెలంగాణ సీఎం (kcr) రివ్యూ చేసి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామన్నారని.. ఏపీ సీఎం డ్రగ్స్‌పై (ys jagan) సమీక్ష ఎందుకు చేయడం లేదని చంద్రబాబు నిలదీశారు. టీడీపీ నేతలపై దాడులు జరిగితే పోలీసులు సాక్ష్యాలు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు మీ చొక్కాలు తీసేసి మాకిస్తే మేమే ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో లెక్కడా లేని మద్యం బ్రాండ్లు వున్నాయని.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ చిన్న పిల్లాడని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీ సీఎంకు డ్రగ్స్‌పై సమీక్ష చేసే తీరిక లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌పై దాడికి సమీక్ష చేస్తారా అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. దాడి చేసినవారిపై కేసులు లేవని.. పట్టాభి (pattabhi) తిట్టారని కేసులు పెట్టారంటూ ఆయన మండిపడ్డారు. పట్టాభి ఏదో తిట్టారంట.. ఆ తిట్టు ఏంటో కూడా తనకు తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టాభి ఏదో మాట్లాడారని వైసీపీ వాళ్లు రీసెర్చ్ చేశారని.. తాను గట్టిగా మాట్లాడతాను కానీ, బూతులు తిట్టనని ఆయన స్పష్టం చేశారు. పట్టాభి మాటలకు కొత్త అర్థాలు చెప్పారని.. ఏపీలో లక్ష కోట్ల డ్రగ్స్ వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నా ఈ గుడ్డి సీఎంకు మాత్రం కనిపించదంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. 

Also Read:కొట్టుకుందాం అంటే.. కొట్టేసుకుందాం, డేట్ .. టైం ఫిక్స్ చేయండి: జగన్‌కు కేశినేని సవాల్

డ్రగ్స్‌పై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని.. డ్రగ్స్, గంజాయి గురించి మాట్లాడితే  ఆనందబాబుకు నోటీసులిచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి తెరలేపారని.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చెల్లెలికి న్యాయం చేయలేని నువ్వు.. నా గురించి మాట్లాడే అర్హత లేదని, జగనన్న బాణం తెలంగాణలో తిరుగుతోందని చంద్రబాబు సెటైర్లు వేశారు. కల్తీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని.. డ్రగ్స్‌తో ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కూడా చేయకూడని తప్పులు చేస్తున్నారని..  రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని చంద్రబాబు హెచ్చరించారు. 

తాను పిలుపునిస్తే 35 వేల ఎకరాలను (amaravathi lands) రైతులు ఇచ్చారని... తమ జీవితాలు బాగుపడతాయని ఎదురుచూశారని ఆయన గుర్తుచేశారు. భూములిచ్చిన రైతులను జగన్ చితక్కొట్టారని.. ఆడవాళ్లను నానా హింసా పెట్టారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఫేక్ రిపోర్టులు తయారు చేయడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రం గురించి, ఈ యువతను గురించి ఆలోచించానని, ప్రపంచమే మెచ్చుకోవాలని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించానని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రధాని వచ్చి ఫౌండేషన్ వేస్తే ఇప్పుడేం చేశారని ఆయన ప్రశ్నించారు. తల్లిపై జగన్‌కు ఎంత మమకారం వుందో ఇప్పుడు తెలుస్తుందని.. జగన్ జైలుకెళ్తే తల్లిని ఉపయోగించుకుని ఊరూరా తిప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. తర్వాత చెల్లిని పెట్టి జగనన్న బాణం అన్నారని.. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ నీతులు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తానే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని చంద్రబాబు గుర్తుచేశారు. రాష్ట్రంలో తీవ్రవాదం, ముఠా రాజకీయాలు, మత విద్వేషాలు ఉండకూడదని పోరాడానని... ఈ క్రమంలో ప్రాణాలు కూడా లెక్కచేయలేదని ఆయన అన్నారు. అలిపిరి వద్ద 24 క్లేమోర్ మైన్లు పేల్చినా సాక్షాత్తు ఆ వెంకటేశ్వరస్వామి తనను కాపాడాడని చంద్రబాబు వెల్లడించారు. ఆయన తనను ఏ ఉద్దేశం కోసం కాపాడాడో తెలియదని.. అప్పుడే తాను భయపడలేదని, ఇప్పుడు భయపడతానా అని ప్రశ్నించారు. 

click me!