అతడొక తాగుబోతు , తిరుగుబోతు : హనుమ విహారిపై వైసీపీ కార్పోరేటర్ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Feb 27, 2024, 9:01 PM IST

టీమిండియా యువ క్రికెటర్ హనుమ విహారి చేసిన ఆరోపణలు క్రీడా, రాజకీయ రంగాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆంధ్రా క్రికెటర్ పృథ్వీరాజ్ తండ్రి..  తిరుపతి వైసీపీ కార్పోరేటర్ కుంట్రపాకం నరసింహాచారి స్పందించారు.


టీమిండియా యువ క్రికెటర్ హనుమ విహారి చేసిన ఆరోపణలు క్రీడా, రాజకీయ రంగాల్లో కలకలం రేపుతున్నాయి. తాను ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్సీ వదులుకోవడానికి ఓ రాజకీయ నేతే కారణమని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ యువ ఆటగాడిపై తాను కోప్పడ్డానని.. దీంతో అతని తండ్రి ఆంధ్రా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేయడంతో తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని విహారి పేర్కొన్నాడు. దీనిపై ఆంధ్రా క్రికెటర్ పృథ్వీరాజ్ తండ్రి..  తిరుపతి వైసీపీ కార్పోరేటర్ కుంట్రపాకం నరసింహాచారి స్పందించారు. తన కుమారుడు పృథ్వీ ఆంధ్రా రంజీ టీమ్‌కు సెలెక్ట్‌ అయినప్పటికీ .. ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదన్నారు. 

తనకు రాజకీయంగా పలుకుబడి వుంటే తన కుమారుడు ఒక్క మ్యాచ్‌లో అయినా పాల్గొనేవాడు కదా అని నరసింహాచారి పేర్కొన్నారు. తన కుమారుడు కనీసం తుది 14 మందిలో అయినా చోటు దక్కేదన్నారు. తన బిడ్డనే కెప్టెన్‌గా చేసుకునేవాడినని, హనుమ విహారి ఇండియాకు ఆడాడని, ఎంతో పరిణితి వుండాలని చారి వ్యాఖ్యానించారు. తొలి రోజు జరిగిన సంఘటనను మనసులో పెట్టుకుని ఇదంతా చేశాడని ఆయన ఆరోపించారు. జరిగిన వాస్తవాలు చెబితే అంతా షాక్ అవుతారని.. విహారికి మద్ధతుగా నిలుస్తున్న వారు ముఖంపై ఉమ్మేసుకోవాల్సిందేనని నరసింహాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

తన బిడ్డ బాధ తట్టుకోలేక ఆంధ్రా క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేశానని.. తన స్థానంలో మరొకరు వుంటే ఇంకోలా నిర్ణయం తీసుకునేవారని నరసింహాచారి అన్నారు. తాను కూడా ఓ క్రీడాకారుడినేనని.. మా అబ్బాయిని తిట్టాడని, కొట్టేందుకు ప్రయత్నించాడని ఆయన తెలిపారు. హనుమ విహారి తొలి రోజే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడని.. అతనొక తాగుబోటు, తిరుగుబోతు అని నరసింహాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

click me!