టీడీపీకి తోడునీడ: నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై కాపు రామచంద్రారెడ్డి ఫైర్

By Siva KodatiFirst Published Jan 30, 2021, 2:53 PM IST
Highlights

టీడీపీకి తోడునీడగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారులను నిమ్మగడ్డ బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు

టీడీపీకి తోడునీడగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి. టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారులను నిమ్మగడ్డ బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ ఫిర్యాదులు చేసినా అమలు చేయాల్సింది ప్రభుత్వమేనని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

కాగా, ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించాలని, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాయడం ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.

Also Read:ఎన్నికల యాప్ మీద గోప్యత: చిక్కుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్

తమ హక్కులకు భంగం కలిగే విధంగా ఎన్నికల కమీషనర్ వ్యవహరించారంటూ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలు ఏపీ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందించారు.

నిమ్మగడ్డ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినా నిమ్మగడ్డ చర్యలు తీసుకోకుండా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అధికారపార్టీ ఆరోపిస్తోంది.

ఈ విషయంపై కూడా నిమ్మగడ్డపై కోర్టులో కేసు వేసే అవకాశాలున్నాయి. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల ద్వారా నిమ్మగడ్డ పూర్తిగా ఇరుకున పడే అవకాశాలున్నాయి. 

click me!