సీఎం జగన్ అంటూ అమరావతిలో ఫ్లెక్సీ

By narsimha lodeFirst Published 22, May 2019, 5:52 PM IST
Highlights

ఏపీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అనే  విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే వైసీపీ నేత ఒకరు ఏపీకి కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అంటూ  అమరావతిలో ఫ్లెక్సీ కట్టారు.

అమరావతి: ఏపీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అనే  విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే వైసీపీ నేత ఒకరు ఏపీకి కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అంటూ  అమరావతిలో ఫ్లెక్సీ కట్టారు.

ఏపీ రాష్ట్రంలో గెలుపుపై టీడీపీ, వైసీపీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.  వైసీపీలో కొందరు నేతలు జగన్‌ సీఎం అంటూ ధీమాగా ఉన్నారు.  వైసీపీకి చెందిన దవులూరి దొరబాబు పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన నేత.  

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్‌కు శుభాకాంక్షలు అని ఫ్లెక్సీపై ప్రింట్ చేయించారు. ఈ ఫ్లెక్సీని ఆయన  తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద కట్టించారు. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Last Updated 22, May 2019, 5:52 PM IST