మరీ ఇలా దిగజారిపోతారా, తెలుగువారి పరువు తియ్యకండి: చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్

Published : May 22, 2019, 05:34 PM IST
మరీ ఇలా దిగజారిపోతారా, తెలుగువారి పరువు తియ్యకండి: చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్

సారాంశం

చంద్రబాబుని చూస్తే జాలేస్తోందని అవంతి చెప్పుకొచ్చారు. చంద్రబాబు మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.   

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు నాయుడు మరీ ఇంతలా దిగజారిపోతారని తాను ఏనాడు ఊహించలేదన్నారు. 

విశాఖపట్నంలో సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.  

చంద్రబాబుని చూస్తే జాలేస్తోందని అవంతి చెప్పుకొచ్చారు. చంద్రబాబు మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా తమ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. మరో 24 గంటల్లో రాష్ట్రంలో రాజన్న పాలన రాబోతుందన్నారు. సొంత వదినను చంపిన దేవినేని ఉమామహేశ్వరావు, బుద్ధిలేని బుద్ధా వెంకన్నలు మీడియా ముందుకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని కొయ్య ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్