రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చూడండి: అధికారులకు జగన్ ఆదేశాలు

By Siva KodatiFirst Published Feb 11, 2021, 6:26 PM IST
Highlights

ఆదాయ వనరుల పెంపుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. బొగ్గు గనుల కార్యకలాపాలపై మరింత ఫోకస్ చేయాలని.. ఎర్రచందనం విక్రయంలో కేంద్రంతో సంప్రదించి అనుమతులు తేవాలని సీఎం ఆదేశించారు

ఆదాయ వనరుల పెంపుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. బొగ్గు గనుల కార్యకలాపాలపై మరింత ఫోకస్ చేయాలని.. ఎర్రచందనం విక్రయంలో కేంద్రంతో సంప్రదించి అనుమతులు తేవాలని సీఎం ఆదేశించారు.

అవినీతికి ఆస్కారం లేకుండా ఎర్రచందనాన్ని విక్రయించాలని.. సిలికా శాండ్ విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండాలని జగన్ సూచించారు. 

కాగా, నిన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మనం ‘ఓన్‌’ చేసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు వెంటనే కార్యరూపం దాల్చాలని అధికారులకు ఆదేశించారు.

గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలు పరిష్కారం కావాలని .. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామని, కొందరు జీతాల పెంపు కోసం రోడ్డెక్కడం తనకు బాధ కలిగించిందని తెలిపారు.

వాలంటీర్ల వ్యవస్థలను మెరుగైన సేవలందించడం కోసమే ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. వాలంటీర్‌ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధమని జగన్ స్పష్టం చేశారు.

విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో వ్యయ నియంత్రణపై మనం తీసుకున్న చర్యలను కేంద్రం ప్రశంసించిందని.. మన విధానాలు మిగిలిన రాష్ట్రాలను ఆకర్షించాయని జగన్ పేర్కొన్నారు.

ఇకపై ఉగాది నుంచి అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు సత్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు . వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇవ్వాలని సూచించారు. 

click me!