వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందరి వాడన్నారు. ఆయన చనిపోయి ఇంతకాలమైనా కూడా మీ హృదయాల్లో ఆయన సజీవంగా ఉన్నాడని వైఎస్ఆర్‌సపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. శుక్రవారం నాడు వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు.
గుంటూరు:YS Rajasekhara Reddy నావాడే కాదు, మీ అందరి వాడని వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు.వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు YS Vijayamma ప్రసంగించారు. YSR కుటుంబాన్ని, తన బిడ్డలను అక్కున చేర్చుకొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నట్టుగా చెప్పారు.
ఇవాళ వైఎస్ఆర్ 73 జయంతిగా ఆమె గుర్తు చేశారు. నా ప్రజా ప్రస్థానం జన జీవితంతో ముడిపడి ఉందని వైఎస్ఆర్ చెప్పేవాడని ఆమె గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ మీ అందరి వాడని వైఎస్ విజయమ్మ చెప్పారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఇంతకాలం తర్వాత కూడా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారన్నారు.
మీ అందరి గుండెల్లో వైఎస్ఆర్ సజీవంగా ఉన్నారన్నారు. వైఎస్ఆర్ ప్లీనరీ మూడో దఫా నడుపుకుంటున్నామన్నారు. రెండు ప్లీనరీలు ఆరంభ దశలో నిర్వహించుకున్నామన్నారు. మూడో ప్లీనరీలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో సగౌరవంగా చెప్పుకుంటూ ప్లీనరీని జరుపుకుంటున్నామని ఆమె చెప్పారు.
రాజకీయ పార్టీలు అధికారం కోసం మాత్రమే పుడుతాయన్నారు. కానీ వైఎస్ఆర్ సీపీ మాత్రం అలా పుట్టలేదన్నారు. నల్లకాలువలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్‌సీపీ పుట్టిందని ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్ లేడంటే కొన్ని గుండెలు ఆగిపోయాయన్నారు. వైఎస్ఆర్ చనిపోయాడంటే రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది చనిపోయారని ఆమె గుర్తు చేశారు. ఈ కుటుంబాల ఆక్రందనలు, హృదయ వేదన నుండే వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భవించిందని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రం నలుమూలల నుండి తమ కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చారన్నారు. తండ్రిని పోగోట్టుకున్న జగన్ కు ఆ బాధ ఏమిటో తెలుసునని చెప్పారు. వైఎస్ఆర్ లేడని చనిపోయాడని తెలుసుకొని చనిపోయిన కుటుంబాలను ఓదార్చేందుకు మీ వద్దకు రాత్రి పగలు తేడా లేకుండా పర్యటించారని ఆమె గుర్తు చేసుకున్నారు.