2009లో పావురాల గుట్టలోనే సంఘర్షణ మొదలైంది: వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో వైఎస్ జగన్

By narsimha lode  |  First Published Jul 8, 2022, 12:00 PM IST


2009 సెప్టెంబర్ 25 న పావురాల గుట్టలోనే సంఘర్షణ ప్రారంభమైందన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీని ప్రారంభిస్తూ శుక్రవారం నాడు జగన్ ప్రసంగించారు.
 



గుంటూరు: పావురాల గుట్ట నుండి  తన సంఘర్షణ ప్రారంభమైందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీని సీఎంజగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సంరద్భంగా ప్రారంభోపాన్యాసం చేశారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పార్టీని ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారుఓదార్పు యాత్రతో పార్టీ ఓ రూపం దాల్చుకుందన్నారు. 

 నాన్న ఆశయ సాధన కోసం, మన ఆత్మాభిమానం కోసం పార్టీ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. అనేక కష్టాలకు ఓర్చి తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికీ  సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పారు.2009 సెప్టెంబర్ 25న పావురాలగుట్టలో సంఘర్షణ ప్రారంభమైందన్నారు.

Latest Videos

ఈ 13 ఏళ్ల ప్రయానంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్టుగా జగన్ గుర్తు చేశారు. మనపై ఎన్ని రాళ్లు వచ్చిపడినా, ఎన్ని నిందలు వేసినా కూడా వాటిని ఎదుర్కొన్నామన్నారు. ఎన్ని కుట్రలు, దాడులు జరిగినా గెండె చెదరలేదు, సంకల్పం మారలేదని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాన్న ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడూ కూడా తన చేయి వీడలేదన్నారు.2019 ఎన్నికల్లో కనీవీని ఎరుగని రీతిలో ఘన విజయం సాధించినట్టుగా చెప్పారు. ఏకంగా 151 స్థానాల్లో ప్రజలకు  అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు.

టీడీపీకి 23 ఎమ్మెల్యేల, 3 ఎంపీ  సీట్లకు పరిమితం చేసి అధికారం అంటే అహంకారం కాదని నిరూపించారన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఇచ్చిన  మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేశామన్నారు. కానీ టీడీపీ మాత్రం తాము ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను తమ వెబ్ సైట్లలో కూడా లేకుండా చేశారన్నారు.

అధికారం వచ్చిన ఈ మూడేళ్ల పాటు కూడా ప్రజల కోసమే పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. పేదల కోసమే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసిందన్నారు. అన్ని వర్గాల కోసం తమ సర్కార్ పనిచేసింన్నారు. అనుబంధాల కోసమే బతికామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకొనేందుకు ప్రతి క్షణం పరితపించామన్నారు.

 

click me!