సిద్దా రాఘవులు మాదిరే గొట్టిపాటి రవిని కూడా..: చినరాజప్ప

By Arun Kumar PFirst Published Jun 26, 2020, 12:45 PM IST
Highlights

వైఫల్యాలకు సమాధానం చెప్పలేక మాట్లాడుతున్న వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి వైసిపి ప్రభుత్వం  శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. 

అమరావతి:  వైఫల్యాలకు సమాధానం చెప్పలేక మాట్లాడుతున్న వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి వైసిపి ప్రభుత్వం  శ్రీకారం చుట్టిందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.  చివరకు సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ లను పార్వడ్ చేసిన వారిని కూడా అరెస్టు చేస్తున్నారని  అన్నారు. వాట్స్ యాప్ మెసేజ్ లను పార్వడ్ చేసినందుకు నందిగామ కృష్ణ, నలంద కిషోర్ లను అరెస్టు చేసి విశాఖపట్నం నుండి కర్నూలు వరకు తీసుకెళ్లి వేదించారని చినరాజప్ప మండిపడ్డారు.

''ఇక తూర్పు గోదావరి జిల్లా నుండి వట్టికూట నరసింహారావు ను మెసేజ్ పార్వడ్ చేసినందుకు నిన్న సాయంత్రం రామచంద్రాపురంలో అరెస్టు చేశారు. ఇతనికి 66 సంత్సరాలు వయస్సు... ఆరోగ్యం బాగోలేదు. అయినా కూడా గుంటూరు తీసుకెళ్లి వేదిస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే వారిని అరెస్టులు చేసి వారిపై కేసులు పెట్టే సంస్కృతికి ఈ ప్రభుత్వం మొదలు పెట్టింది'' అని అన్నారు.

read more బాబుకు షాక్: వైసీపీలో చేరిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు

''వైకాపా నాయకులు మాత్రం చంద్రబాబును, లోకేష్ బాబు, అచ్చెన్నాయుడును కించపరిచే విధంగా మాట్లాడుతున్నా పోలిసులు పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు'' అని హెచ్చరించారు. 

వీడియో

"

'' ప్రకాశం జిల్లా గనుల విషయంలో రూ.300 కోట్ల రూపాయల వరకు కూడా ఫైన్ వేయడం జరిగింది. ఈ విధంగానే బయపెట్టి సిధ్ధా రాఘవరావు ను లోబరుచుకోవడం జరిగింది. ఇలాగే గొట్టిపాటి రవిని కూడా లోబరుచుకోవాలని చూస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని వంతడలో గత 10 సంవత్సరాలుగా గనులు లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తున్న పూతల శేషగిరిరావు వైకాపా ప్రభుత్వం వేధింపులకు గురి చేయడంతో హార్ట్ ఎటాక్ చనిపోయారు. వైకాపా బెదిరింపులతో చాలా మంది చనిపోతున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''సామాన్యుల పొట్టగొడుతూ పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. రాష్ట్రంలో 10 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దాతలు ఇచ్చిన నిధులను మత్రమే కరోనా నివారణకు ఖర్చు చేస్తున్నారు. కరోనా పై శ్రద్ధ పెట్టకుండా కేసులు పెట్టి ప్రతిపక్షాలను హింసించడంపై శ్రద్ధ పెట్టారు. కరోనాను గాలికొదిలేశారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. కాబట్టి ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగతంగా శ్రద్ధ వహించి జాగ్రత్తలు పాటించాల్సింది కోరుతున్నాను'' అని చినరాజప్ప
 అన్నారు.
 

click me!