150 స్థానాల్లో విజయం ఖాయం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా

Published : Feb 05, 2019, 03:06 PM IST
150 స్థానాల్లో విజయం ఖాయం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా

సారాంశం

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వైసీపీ ఎన్నికలకు సిద్దమవుతోందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమది అతి విశ్వాసం కాదని ఆత్మ విశ్వాసమని చెప్పుకొచ్చారు.  

అమరావతి : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వైసీపీ ఎన్నికలకు సిద్దమవుతోందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమది అతి విశ్వాసం కాదని ఆత్మ విశ్వాసమని చెప్పుకొచ్చారు.  

పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. వారందరికీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. 

అన్ని రకాల ఎత్తుగడలు, చేయరాని పనులన్నీ చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఎప్పటికీ ఆయనలో మార్పులేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు నాలుగు దశాబ్ధాలపాటు నిలిచిపోయేలా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్