చిత్తూరులో ఘోరం... ఆర్టిసి బస్సు-లారీ ఢీ, 13మందికి గాయాలు

Published : Jul 08, 2022, 11:41 AM ISTUpdated : Jul 08, 2022, 11:58 AM IST
చిత్తూరులో ఘోరం... ఆర్టిసి బస్సు-లారీ ఢీ, 13మందికి గాయాలు

సారాంశం

చిత్తూరు జిల్లాలో కర్ణాటక ఆర్టిసి బస్సు, లారీ ఢీకొని 13మంది గాయపడ్డారు. గాయపడిన వారందరూ చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

చిత్తూరు : కర్ణాటక ఆర్టిసి బస్సు-లారీ ఢీకొనడంతో 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డుప్రమాదం చిత్తూరు జిల్లాలో చోటుచేసకుంది. గాయాలపాలైన వారు చిత్తూరు పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టిసి బస్సు ప్రయాణికులతో ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి వైపు వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. పూతలపట్టు మండలం టి.రంగంపేటలోని ప్లైఓవర్ వద్ద బస్సు-లారీ ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన అందరూ సురక్షితంగానే వున్నారని... ఎవరికీ ప్రాణహాని లేదని సమాచారం.

రెండు పెద్ద వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అధికారులు, పోలీసులు వెంటనే స్పందించారు. వాహనాలను రోడ్డుపైనుండి పక్కకు తీసుకెళ్లారు. డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదానికి ముగ్గురు బలయ్యారు.  మద్యంమత్తులో కారును నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.  మృతులు ముగ్గురు మహారాష్ట్రకు చెందినవారు. 

హైద్రాబాద్ ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్న కారు అతివేగంతో దూసుకువెళుతూ ఓ కంటైనర్ ను వెనకనుండి ఢీకొట్టింది. కారు డ్రైవర్ మద్యంమత్తులో డ్రైవింగ్ చేయడంవల్లే ప్రమాదం జరిగింది.  మృతులను  మహారాష్ట్రలోని ఔరంగబాద్ కు చెందిన ఆనంద్, సంపత్, రంగనాథ్ లు గా గుర్తించారు. తిరుపతి నుండి ఔరంగబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

కారు ముందు భాగం కంటైనర్ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది.  దీంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. కారులో ఉన్న మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇక గత నెల 29న హైద్రాబాద్  ఔటర్ రింగ్ రోడ్డుపై ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు  మరణించారు. మహారాష్ట్ర నుండి హైద్రాబాద్ కు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్