చంద్రబాబు మైండ్ బ్లాక్ , అందుకే పిచ్చి నిర్ణయాలు:వైవీ సుబ్బారెడ్డి

Published : Nov 16, 2018, 04:37 PM IST
చంద్రబాబు మైండ్ బ్లాక్ , అందుకే పిచ్చి నిర్ణయాలు:వైవీ సుబ్బారెడ్డి

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని అందువల్లే ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. 

ఏలూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందని అందువల్లే ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. 

పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో బూత్ కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న సుబ్బారెడ్డి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో త్వరలోనే తీర్పు వెలువడుతుందని స్పష్టం చేశారు. 

సీబీఐని రాష్ట్రంలో రాకుండా చట్టం చెయ్యడమంటే మైండ్ పనిచెయ్యకపోవడం వల్లేనని ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగిస్తారనే భయంతోనే  ఈ చట్టం చేశారని వైవీ అన్నారు. దాడి ఘటనలో సీఎం స్థాయి వ్యక్తి ఉన్నాడనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుందన్నారు. సీబీఐ విచారణ వేస్తే టీడీపీ నేతలు ఉండటానికి రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని ఎద్దేవా చేశారు. 

మరోవైపు  టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అరాచకాలు చూస్తుంటే రౌడీరాజ్యం, దోపిడి రాజ్యం తలపిస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలను భయపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కార్యకర్తలకు అండగా జగన్ ఉన్నారని ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జన్మభూమి కమిటీలతో పచ్చచొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు అండ్ కోపై సీబీఐ దాడులు, అందుకే సీబీఐకి నో ఎంట్రీ:ఉమ్మారెడ్డి

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్