కష్టాల్లో ఉన్న ప్రతీ కుటుంబానికి పెద్దకొడుకుగా చంద్రబాబు అండ:సోమిరెడ్డి

Published : Nov 16, 2018, 03:47 PM IST
కష్టాల్లో ఉన్న ప్రతీ కుటుంబానికి పెద్దకొడుకుగా చంద్రబాబు అండ:సోమిరెడ్డి

సారాంశం

కష్టాల్లో ఉన్న ప్రతీ కుటుంబానికి పెద్దకొడుకుగా చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కష్టాల్లో ఉన్నవారిపాలిట చంద్రబాబు ఆపన్నహస్తంలా మారారన్నారు.

అమరావతి: కష్టాల్లో ఉన్న ప్రతీ కుటుంబానికి పెద్దకొడుకుగా చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కష్టాల్లో ఉన్నవారిపాలిట చంద్రబాబు ఆపన్నహస్తంలా మారారన్నారు.
 
నెల్లూరు జిల్లాలో మంత్రి సోమిరెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 56 మందికి రూ.34.23 లక్షలు ఆర్థికసాయం మంజూరు అయ్యింది. ఈ నేపథ్యంలో బాధితులకు సోమిరెడ్డి చెక్కులు అందజేశారు. 

ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి రాని చికిత్సలను దేశంలోని ఏ ఆస్పత్రిలో చేయించుకున్నా ఆర్థికసాయం చేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.పేదలకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2.70 కోట్ల మంది పేదల జీవితాలకు బీమా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని సోమిరెడ్డి కొనియాడారు. 

ఈ వార్తలు కూడా చదవండి

దివ్యాంగులకు స్మార్ట్ ఫోన్,ల్యాప్ టాప్:సోమిరెడ్డి

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు