చంద్రబాబు అండ్ కోపై సీబీఐ దాడులు, అందుకే సీబీఐకి నో ఎంట్రీ:ఉమ్మారెడ్డి

By Nagaraju TFirst Published Nov 16, 2018, 4:11 PM IST
Highlights

ఏపీలో సీబీఐకు నో ఎంట్రీ అంటున్న ప్రభుత్వం తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఒక ఉన్నత స్థాయి విచారణ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఏపీలో సీబీఐకు నో ఎంట్రీ అంటున్నారని ఆరోపించారు. 
 

విజయవాడ: ఏపీలో సీబీఐకు నో ఎంట్రీ అంటున్న ప్రభుత్వం తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఒక ఉన్నత స్థాయి విచారణ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఏపీలో సీబీఐకు నో ఎంట్రీ అంటున్నారని ఆరోపించారు. 

శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజ్యాంగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన నేతలు నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో విచ్చలవిడిగా అన్యాయాలు  జరుగుతున్నాయని  మండిపడ్డారు. ఏసీబీకి నో ఎంట్రీపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. గతంలో కూడా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భాలను ఉమ్మారెడ్డి ప్రస్తావించారు. 

ధర్మాబాద్ కోర్టు నోటీసుల నేపథ్యంలో నాకు ఏదైనా జరిగితే వలయంగా నిలవాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అలాగే ఐటీ రైడ్స్ సందర్భంగా నాపై కూడా దాడులు జరగొచ్చు అంటూ వ్యాఖ్యానించారని ఆ తర్వాత ఏపీలో సీబీఐకు నో ఎంట్రీ అన్నారని మండిపడ్డారు. 

ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఇది దుర్మార్గ చర్య అంటూ అభిప్రాయపడ్డారు. 23 ఏళ్లుగా ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులపై సీబీఐ దాడులకు పాల్పడుతుందన్న అనుమానంతోనే ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అంటూ  ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. 


 

click me!