కార్లను మాదిరిగానే భార్యలను మారుస్తాడు: పవన్‌పై జగన్‌ సంచలనం (వీడియో)

Published : Jul 24, 2018, 07:42 PM ISTUpdated : Jul 24, 2018, 07:56 PM IST
కార్లను మాదిరిగానే భార్యలను మారుస్తాడు: పవన్‌పై జగన్‌ సంచలనం (వీడియో)

సారాంశం

 జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్త కార్లను మార్చినట్టుగా భార్యలను మార్చే పవన్ కళ్యాణ్  నీతులు చెబితే వినాల్సిన దుస్థితి నెలకొందని ఆయన చెప్పారు.   

కాకినాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్త కార్లను మార్చినట్టుగా భార్యలను మార్చే పవన్ కళ్యాణ్  నీతులు చెబితే వినాల్సిన దుస్థితి నెలకొందని ఆయన చెప్పారు. 

మంగళవారం నాడు సాయంత్రం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినా మనం వినాల్సి రావడం మన ఖర్మ. పవన్ కళ్యాణ్ టీడీపీ , బీజేపీతో కలిసి ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు నేను తప్పుచేశానని చెబుతున్నాడు. నేను పతివ్రతను అని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబును రక్షించేందుకు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం... బాబుకు పరోక్షంగా  అనుకూలంగా మాట్లాడడమే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌కు నలుగురు పెళ్లాలని చెప్పారు. నాలుగు ఏళ్లకు ఒక్కసారి కొత్తకారును మార్చినట్టుగా పెళ్లాలను మార్చుతాడని జగన్ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. విలువల గురించి ఏం తెలుసునని పవన్ కళ్యాణ్ మాట్లాడుతాడని ఆయన ప్రశ్నించారు.

వపన్ కళ్యాణ్ నుండి కూడ విలువల గురించి తెలుసుకోవాల్సి వస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఏం చేసినా బాబుకు  అనుకూంగానే పవన్ చేస్తున్నారని జగన్ పవన్ పై  విమర్శలు గుప్పించారు.

 

"


 

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu