ప్రజా సంకల్పయాత్ర: జగన్ ఆరోగ్య రహస్యమిదే...!

By narsimha lodeFirst Published Sep 24, 2018, 10:50 AM IST
Highlights

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేపట్టిన  ప్రజా సంకల్పయాత్ర  మూడువేల కిలోమీటర్లకు చేరుకొంది


అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేపట్టిన  ప్రజా సంకల్పయాత్ర  మూడువేల కిలోమీటర్లకు చేరుకొంది.అయితే మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైఎస్ జగన్  ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్ర కొనసాగడం వెనుక ఆయన ఆరోగ్యమే కీలక పాత్ర పోషిస్తోంది.

 వైఎస్ జగన్  పాదయాత్ర నిర్విరామంగా యాత్ర కొనసాగించడానికి ఆయన తీసుకొనే  ఆహరపు అలవాట్లు కూడ  వైఎస్ జగన్ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఏ రోజు కూడ  షెడ్యూల్ మిస్ కాకుండా జగన్  పాదయాత్రను కొనసాగిస్తున్నాడు.

రాత్రిపూట ఎంత ఆలస్యంగా పడుకొన్నా  జగన్ ఉదయం నాలుగున్నర గంటలకు నిద్ర లేస్తాడు. గంటపాటు వ్యాయామం చేస్తారు.కాలకృత్యాలు తీర్చుకొన్న తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తలను చదువుతారు.

ఆ తర్వాత పాదయాత్ర రూట్ మ్యాప్ గురించి తెలుసుకొంటారు. పాదయాత్ర జరిగే  ప్రాంతానికి చెందిన పార్టీ నేతలతో జగన్ చర్చిస్తారు.  పాదయాత్ర ఎక్కడ ప్రారంభం అవుతోంది...పాదయాత్ర ఎక్కడ ముగుస్తోందనే విషయమై  స్థానిక నాయకులతో చర్చిస్తారు.ఆ తర్వాత  పాదయాత్రకు రెడీ అవుతారు.

 ప్రతి రోజూ ఉదయం పూట కేవలం గ్లాస్ జ్యూస్ మాత్రమే  బ్రేక్‌ఫాస్ట్‌గా జగన్ తీసుకొంటారు. షెడ్యూల్ ప్రకారంగానే జగన్ యాత్రను ప్రారంభించేలా ప్లాన్ చేసుకొంటారు.  మధ్యాహ్నం మాత్రం కొన్ని పండ్లు, కప్పు పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకొంటారు. రాత్రి పూట రెండు పుల్కాలు,  పప్పు, మరో కూరతో భోజనం ముగిస్తారు.  రాత్రి పడుకోబోయే ముందు  కప్పు పాలు తాగుతారు. 

సంబంధిత వార్తలు

పాదయాత్రలో వైఎస్ జగన్ దినచర్య ఇదీ..

 

click me!