వైఎస్ జగన్ తో బీసీ నేతల సమావేశం: డిక్లరేషన్ పై చర్చ

By Nagaraju penumalaFirst Published Feb 13, 2019, 5:42 PM IST
Highlights

ఇకపోతే ఫిబ్రవరి 17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించబోయే బీసీ గర్జన సభలో ఇవ్వాల్సిన హామీలపై చర్చించారు. బీసీ వర్గాలను అన్ని విధాలా ఆదుకోవడంతోపాటు వారి అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. 

హైదరాబాద్‌ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీసీ గర్జన సభపై వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో బీసీ నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. 

పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారధి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తిలతో సమావేశమైన జగన్ బీసీ గర్జన సభ నేపథ్యంలో బీసీ డిక్లరేషన్, గర్జన సభకు సంబంధించి పలు అంశాలపై ఆరా తీశారు. 

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ ఏడాది క్రితం బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాలు, 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి బీసీ వర్గాల ప్రజల బాధలు, ఇబ్బందులు, వారి సమస్యల పరిష్కారానికి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తూ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను వైఎస్ జగన్ కు నేతలు సమర్పించారు. 

click me!