కోడికత్తి కేసు:నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

By narsimha lode  |  First Published Feb 8, 2024, 12:51 PM IST

2019 ఎన్నికలకు ముందు  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జరిగిన దాడి కేసులో  నిందితుడు  శ్రీనివాస్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  ఊరట లభించింది.


అమరావతి:  కోడికత్తి కేసు నిందితుడు  శ్రీనివాస్  కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది.కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావుకు  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో  బెయిల్ మంజూరు చేసింది.  కోడికత్తి కేసులో  బెయిల్ మంజూరు చేయాలని శ్రీనివాస్  ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు.  ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ ఏడాది జనవరి  24న రిజర్వ్ చేసింది.  అయితే  ఇవాళ ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది.  

కేసు విషయమై  మీడియాతో మాట్లాడవద్దని  కోర్టు షరతు విధించింది.వారానికి ఒక్క రోజు ట్రయల్ కోర్టు హాజరు కావాలని  కోర్టు ఆదేశించింది. 2018 అక్టోబర్  25న  విశాఖపట్టణం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లో  అప్పటి విపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై   శ్రీనివాసరావు కోడికత్తితో దాడికి దిగినట్టుగా  ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరావుపై కేసు నమోదైంది.ఈ కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత విశాఖపట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆ తర్వాత  అయితే  ఈ కేసు ఎన్ఐఏకి బదిలీ అయింది.

Latest Videos

undefined

2019 జూలైలో శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చింది.  శ్రీనివాసరావుకు  బెయిల్ పై  హైకోర్టులో  ఎన్ఐఏ అధికారులు సవాల్ చేశారు.దీంతో  హైకోర్టు  శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. అప్పటి నుండి ఇప్పటివరకు  శ్రీనివాసరావు  జైల్లోనే ఉన్నాడు.  

also read:జగన్ పై కోడికత్తి కేసులో కీలక పరిణామం: ఎన్ఐఏ కోర్టు విచారణపై 8 వారాల స్టే విధించిన ఏపీ హైకోర్టు

ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన సమయంలో అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ స్టేట్ మెంట్ ను తీసుకున్నారు. ఈ కేసులో రెండో సాక్షిగా ఉన్న బాధితుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్టేట్ మెంట్ తీసుకోవాల్సి ఉంది. అయితే  కోర్టుకు హాజరు కాలేనని  అడ్వకేట్ కమిషన్ ను ఏర్పాటు చేసి స్టేట్ మెంట్ తీసుకోవాలని జగన్  కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు ఈ కేసులో  లోతైన దర్యాప్తు చేయాలని  జగన్ ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.

మరో వైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  శ్రీనివాస్ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తర్వాత శ్రీనివాసరావుకు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
 

click me!