జగన్‌పై పట్టాభి వ్యాఖ్యలు.. టీడీపీ హెడ్ ఆఫీస్‌పై వైసీపీ శ్రేణుల దాడి, మంగళగిరికి బయల్దేరిన చంద్రబాబు

By Siva KodatiFirst Published Oct 19, 2021, 6:11 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan), రాష్ట్ర ప్రభుత్వంపై (ap govt) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ (ysrcp) నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan), రాష్ట్ర ప్రభుత్వంపై (ap govt) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ (ysrcp) నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగారు. ఇప్పటికే విజయవాడలోని పట్టాభి ఇంటిపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు. అదే సమయంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనా వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఆఫీసు ఆవరణలో పార్క్ చేసిన వాహనాలను కార్యాలయ అద్దాలను  ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu).. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మంగళగిరికి బయల్దేరారు. 

కాగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు (nakka ananda babu) పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ (tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ పాలేరు ఆడమన్నట్టు పోలీసులు ఆడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా (ganja cultivation in andhra pradesh) మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ (telangana police), తమిళనాడు (tamilnadu police) పోలీసులు గంజాయి స్మగ్లర్లని పట్టుకోవడానికి ఏపీకి ఎందుకు వచ్చారని పట్టాభి ప్రశ్నించారు.

Also Read:గంజాయి స్మగ్లింగ్.. జగన్‌పై వ్యాఖ్యలు: టీడీపీ నేత పట్టాభి ఇంటిలో వైసీపీ కార్యకర్తల బీభత్సం

నిన్న మధ్యాహ్నం మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు (ap police) ఆనందబాబు ఇంటికి రావడంపై పట్టాభిపై మండిపడ్డారు. నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు.. ఆనందబాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చారని మండిపడ్డారు.

ఆనంద్ బాబుకు నోటీసులివ్వడంలోచూపిన మెరుపువేగం, గంజాయిసాగుని అరికట్టడంలో చూపితే బాగుండేదంటూ పోలీసులపై కొమ్మారెడ్డి పట్టాభి ఫైర్ అయ్యారు. పైస్థాయి అధికారులు చెప్పారు కదా అని, కిందిస్థాయిలో ఉన్న పోలీసులు శృతిమించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారందరూ భవిష్యత్‌లో చట్టపరంగా, న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని పట్టాభి హెచ్చరించారు.
 

click me!