పల్నాడు జిల్లా : టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి.. ఒకరి మృతి, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jun 03, 2022, 05:16 PM IST
పల్నాడు జిల్లా : టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి.. ఒకరి మృతి, ఉద్రిక్తత

సారాంశం

పల్నాడు జిల్లాలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు  దాడికి దిగారు. దుర్గిలో బ్యాంక్‌  పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా జంగ మహేశ్వరపురంలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నేత జల్లయ్య మృతి చెందాడు.

పల్నాడు జిల్లాలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు  దాడికి దిగారు. జంగమహేశ్వరపురంలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై శుక్రవారం దాడి జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నేత జల్లయ్య మృతి చెందగా.. మరొకరి పరిస్ధితి విషమంగా వుంది. దుర్గిలో బ్యాంక్‌  పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే