
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీపై (jagan delhi tour) విమర్శలు గుప్పించారు టీడీపీ (tdp) నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (bandaru satyanarayana murthy) . విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది మోసపూరిత పర్యటనగా బండారు అభివర్ణించారు. ఎన్నిసార్లు మోడీని (narendra modi) కలిసినా రాష్ట్ర కోసం చేసింది ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం, రైల్వేజోన్, లోటుపాట్లు కోసం చర్చించి ఏమైనా సాధించారా అని బండారు సత్యనారాయణ మూర్తి నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఉద్యమ డ్రామా చేశారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ మోసపూరిత సీఎం అని.. బీజేపీకి (bjp) దత్తపుత్రుడుగా ఉన్నవా అంటూ బండారు ఫైరయ్యారు.
25 సీట్లు వస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్నారు.. ఇప్పడు జగన్ మోడీ పాదాలు మొక్కుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అవినీతిపరుడని.. జగన్ రాష్ట్రాన్ని తన సొంతానికి వాడుకుంటున్నారని బండారు సత్యానారాయణ మూర్తి ఆరోపించారు. చరిత్రలో ఇంత దిగజారుడు రాజకీయం ఎప్పుడు చూడలేదని.. సీబీఐ, బాబాయ్ హత్య కేసులు కోసమే మోడీని కలుస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకులు, విజయసాయి రెడ్డితో కలిసి స్టీల్ ప్లాంట్ కోసం దొంగ ఉద్యమాలు చేశారని బండారు ఎద్దేవా చేశారు. మోడీని జగన్ ఎందుకు కలుస్తున్నారో మీడియాకి ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. మోడీ టీడీపీతో కలిస్తే ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ లాంటి వాటి కోసం అడుగుతామని బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.
Also Read:అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ: ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ టూర్
మరో వైపు Andhra pradesh, Telangana మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు ఏపీ సీఎం జగన్ . విభజన అంశాలపై కేంద్ర హోం మంత్రితో భేటీ సందర్భంగా జగన్ వివరించినట్టుగా తెలుస్తుంది. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, మెడికల్ కాలేజీలు, ఏపీఎండీసీకి గనుల కేటాయింపుపైనా సీఎం జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించారు. అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ నుండి అమరావతికి బయలుదేరారు.
నిన్న దాదాపు 45 నిమిషాల పాటు మోదీతో సమావేశమయ్యారు జగన్. రాష్ట్రానికి రెవెన్యూలోటు కింద రూ. 32,625 కోట్లు రావాల్సి ఉందని వినతిపత్రంలో తెలిపారు. అలాగే రుణ పరిమితిలో 17,928 కోట్లు కోత విధించారని, దీనిని సరిదిద్దాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,467 కోట్లకు ఖరారు చేసి నిధులు విడుదల చేయాలని జగన్ కోరారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ సమావేశమయ్యారు. ఆపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలంటూ కోరారు.