ఎన్నికల్లో రాజీ చేశాడని.. వైఎస్సార్ సీపీ కార్యకర్త దారుణ హత్య..

Published : Feb 22, 2021, 09:45 AM IST
ఎన్నికల్లో రాజీ చేశాడని.. వైఎస్సార్ సీపీ కార్యకర్త దారుణ హత్య..

సారాంశం

వైఎస్సార్ జిల్లాలో దారుణం జరిగింది. మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. 

వైఎస్సార్ జిల్లాలో దారుణం జరిగింది. మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం ముడుమాల గ్రామంలో టీడీపీ వర్గీయులు ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్త ముడుమాల భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. 

బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల కథనం మేరకు.. ముడుమాల, పలుగురాళ్లపల్లె పంచాయతీల సర్పంచులుగా వైఎస్సార్సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఏకగ్రీవ ఎన్నికను జీర్ణించుకోలేని పలుగురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు మీసాల దుగ్గిరెడ్డి, ఆయన అనుచరులు ఆదివారం ముడుమాల, జౌకుపల్లె గ్రామాల మధ్యలో భాస్కర్‌రెడ్డితో ఘర్షణకు దిగారు. 

ఏకగ్రీవ ఎన్నికకు నువ్వే కారణం అంటూ.. ‘నువ్వు రాజీ చేస్తావా..’ అంటూ ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు భాస్కర్ రెడ్డి కుప్పకూలిపోవడంతో వారు పారిపోయారు. ఈ విషయం తెలిసిన భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని 108 వాహనంలో అతడిని బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. 

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారి మఠం పోలీసులు.. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu