వేలానికి ‘యాత్ర’ సినిమా టికెట్.. ధర రూ.4.37లక్షలు

Published : Feb 04, 2019, 09:54 AM ISTUpdated : Feb 04, 2019, 02:19 PM IST
వేలానికి ‘యాత్ర’ సినిమా టికెట్.. ధర రూ.4.37లక్షలు

సారాంశం

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మళయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్ర పోషించాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.

కాగా.. ఈ సినిమా టికెట్ కి ఇటీవల వేలంపాట నిర్వహించారు. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్వాణ సంస్థలు అమెరికాలో సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని తెలిపారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 8న యాత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu