బీజేపీకి టచ్ లో వైసీపీ ఎంపీలు : బాంబు పేల్చిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు

By Nagaraju penumala  |  First Published Nov 21, 2019, 3:26 PM IST

గురువారం మధ్యాహ్నం నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రధాని నరేంద్రమోదీ పలకరించారు. ఆయన భుజం తట్టారు. ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు కొద్ది సేపట్లోనే ఈ వ్యహారమంతా జరగడం విశేషం. 
 


అమరావతి: వలసలతో ఏపీ రాజకీయాలు శీతాకాలంలో కూడా హీటెక్కిస్తున్నాయి. అలాంటి తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సొము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరింత అగ్గిరాజేశారు. 

ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నేతలు వైసీపీ, బీజేపీ పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. దాంతో ఎవరు ఎప్పుడు పార్టీ వీడతారోనన్న ఆందోళనలతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

Latest Videos

ఇలాంటి సందర్భంలో వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ ఆపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు తమ పార్టీ అధినాయకత్వంతో టచ్ లో ఉన్నారని అయితే ఎంతమంది బీజేపీలో చేరతారా అనేది ఇప్పుడే చెప్పలేమంటూ బాంబు పేల్చారు. 

మరోవైపు మాజీ సీఎం 
చంద్రబాబు, ప్రస్తుత సీఎం వైయస్ జగన్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికీ మతపరమైన విధానంలో ఎలాంటి తేడా లేదని చెప్పుకొచ్చారు. క్రిస్టియన్, ముస్లింల ఓటు బ్యాంక్  రాజకీయాలకు చంద్రబాబు, జగన్ లు తెరలేపారని ఆరోపించారు. 


క్రైస్తవం, ఇస్లాం మాత్రమే మతాలు అని 

హిందుత్వం అనేది మతం కాదని కేవలం ధర్మం మాత్రమేనని చెప్పుకొచ్చారు. ధర్మం, జీవన విధానం భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ అన్నారు. మతపరమైన ఓటు బ్యాంక్ రాజకీయాలకు బీజేపీ దూరంగా ఉంటుందన్నారు. పాస్టర్లకు, ఇమాంలకు జీతాలు ఇస్తామని చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.  


అవినీతి అక్రమ కేసులు ఎదుర్కొంటున్న పలు పార్టీల నేతలను తమ పార్టీలోకి తీసుకోకూడదంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఏపీలో తాము కూడా బలపడాలి అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తమకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పాలన అందించాలని అనుకుంటాం కదా అని స్పష్టం చేశారు. 

టీడీపీ, వైసీపీలు మాత్రం చేర్చుకోవచ్చు బీజేపీని మాత్రమే కరెక్ట్ గా ఉండాలంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తెలుగును తీసేస్తామనే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇంగ్లీషు మీడియం అమలుపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 


క్రిస్టియానిటీని ప్రొత్సహించేందుకే ఇంగ్లీషు మీడియం తీసుకు వస్తున్నారన్న వ్యాఖ్యలపై తాను స్పందించనని ఆ వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీనారాయణను సంప్రదించాలన్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలే తప్ప ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని తేల్చి చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సీఎం జగన్ జాగ్రత్త పడాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నం నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రధాని నరేంద్రమోదీ పలకరించారు. ఆయన భుజం తట్టారు. ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు కొద్ది సేపట్లోనే ఈ వ్యహారమంతా జరగడం విశేషం. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఇంట్రెస్టింగ్: వైసీపీ ఎంపీకి జగన్ క్లాస్, బాగున్నారా అంటూ ఆ ఎంపీ భుజం తట్టిన మోదీ

click me!