ఇంట్రెస్టింగ్: వైసీపీ ఎంపీకి జగన్ క్లాస్, బాగున్నారా అంటూ ఆ ఎంపీ భుజం తట్టిన మోదీ

By Nagaraju penumala  |  First Published Nov 21, 2019, 3:02 PM IST

రాజ్యసభ నుంచి తన చాంబర్ కు వెళ్తున్న ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఆప్యాయంగా పిలిచారు. రాజుగారు బాగున్నారా అంటూ తెలుగులో మరీ ఆప్యాయంగా పలకరించారు. 


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ వైసీపీ ఎంపీలతో ప్రత్యేకించి ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. పార్లమెంట్ సమావేశాల్లోనో, అఖిలపక్ష సమావేశం సందర్భంగానో వైసీపీకి చెందిన ఎంపీతో ప్రత్యేకించి మాట్లాడటం, కరచాలనం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. 

గత పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన మోదీ తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఆప్యాయంగా పలకరించారు. 

Latest Videos

రాజ్యసభ నుంచి తన చాంబర్ కు వెళ్తున్న ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఆప్యాయంగా పిలిచారు. రాజుగారు బాగున్నారా అంటూ తెలుగులో మరీ ఆప్యాయంగా పలకరించారు. 

అనంతరం కరచాలనం చేశారు. రఘురామకృష్ణం రాజు భుజం తట్టిన ప్రధాని అనంతరం తన ఛాంబర్ కు వెళ్లిపోయారు. ఆ సమయంలో రఘురామకృష్ణం రాజు పక్కన ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. 

ఇకపోతే పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీలతో సమావేశమైన జగన్ వైసీపీ పార్లమెంటరీ నేత జయసాయిరెడ్డి లేనిదే ప్రధాని మోదీని గానీ కేంద్రమంత్రులను గానీ నేరుగా కలవద్దని సూచించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజును ప్రత్యేకించి పలకరించడం ఆయన భుజం తట్టడంపై వైసీపీ నేతలు సైతం ఒక్కకసారిగా ఆలోచనలో పడ్డారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు లోక్‌సభలో తెలుగుభాషపై కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం కాస్త వివాదాస్పదమైంది. 

ఓవైపు ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే అందుకు మద్దతుగా మాట్లాడాల్సింది పోయి తెలుగుమీడియంకు అనుకూలంగా మాట్లాడటంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకు ఇలా ప్రవర్తించారని నిలదీస్తూ క్లాస్ తీసుకున్నారని పబ్లిక్ టాక్. 

ఇలాంటి సందర్భంలో ఉన్నట్టుండి ఆయనను మోదీ పలకరించడం భుజం తట్టడంపై వైసీపీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. మరోవైపు రఘురామకృష్ణం రాజు మాజీ బీజేపీ నేత. గతంలో వైసీపీకి రాజీనామా చేసిన రఘురామకృష్ణం రాజు అనంతరం బీజేపీలో చేరారు.  ఆతర్వాత టీడీపీ అనంతరం తిరిగి సొంతగూటికి చేరుకున్న సంగతి తెలిసిందే.  
 
ఇకపోతే గతంలో జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రధాని నరేంద్రమోదీ ఇలానే వ్యవహరించారు. ఆనాడు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని ప్రత్యేకించి పలకరించారు.  

ఇతర కేంద్రమంత్రులతో కలిసి నడుచుకుంటూ తన ఛాంబర్ కు వెళ్తున్న ప్రధాని మోదీ విజయసాయిరెడ్డిని చూసి ఆగి మరీ పలకరించారు. హాయ్ విజయ్ గారూ అంటూ సంబోధిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు.  

ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా తనవద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించడంతో ఆనాడు విజయసాయిరెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యారు. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా తన అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయటకు వెళుతూ లాబీలో శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి 'హాయ్ విజయ్‌ గారు' అని పలకరిస్తూ నా వైపు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం’’ అని ప్రధాని మోదీ తనను పలకరిస్తోన్న వీడియోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు: రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్

బీజేపీకి టచ్ లో వైసీపీ ఎంపీలు : బాంబు పేల్చిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు

click me!