గోదావ‌రి న‌దిలో దూక‌బోయిన యువకుడిని కాపాడిన ఎంపీ మార్గాని భరత్‌ రామ్

Published : Feb 15, 2023, 04:46 PM IST
గోదావ‌రి న‌దిలో దూక‌బోయిన యువకుడిని కాపాడిన ఎంపీ మార్గాని భరత్‌ రామ్

సారాంశం

Rajamahendravaram: రాజ‌మ‌హేంద్రవ‌రంలో ఒక వ్య‌క్తి వంతెన పై నుంచి గోదావ‌రి న‌దిలో దూక‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఇదే స‌మయంలో అటుగా వెళ్తున్న పార్ల‌మెంట్ స‌భ్యులు మార్గాని భ‌ర‌త్ రామ్ చాకచక్యంగా అత‌న్ని కాపాడాడు. అనంత‌రం ఈ ఘ‌ట‌న గురించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.   

Margani Bharat Ram: గోదావ‌రి న‌దిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డ‌నికి ప్ర‌య‌త్నిస్తున్న ఒక వ్య‌క్తిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ కాపాడారు. అనంత‌రం అత‌నికి ధైర్యం చెప్పి.. ఈ ఘ‌ట‌న గురించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ క్ర‌మంలోనే ఎంపీపై స్థానికులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. రాజ‌మ‌హేంద్రవ‌రంలో ఒక వ్య‌క్తి వంతెన పై నుంచి గోదావ‌రి న‌దిలో దూక‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఇదే స‌మయంలో అటుగా వెళ్తున్న పార్ల‌మెంట్ స‌భ్యులు మార్గాని భ‌ర‌త్ రామ్ చాకచక్యంగా అత‌న్ని కాపాడాడు. అనంత‌రం ఈ ఘ‌ట‌న గురించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రాజమండ్రిలోని రోడ్డు-రైల్వే వంతెనపై మంగళవారం నాడు ఈ ఘటన జరిగింది.

స్థానికులు, పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. నిడదవోలులోని ఉనకరమిల్లికి చెందిన అయ్యప్ప అనే వ్య‌క్తి ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి జడ్చర్లలోని అరబిందో ఫార్మసీలో మూడేళ్లు పనిచేశాడు. మంగళవారం బైక్‌పై రాజ‌మండ్రి వంతెన‌పైకి వ‌చ్చి గోదావ‌రి నదిలో దూకడానికి ప్ర‌య‌త్నించాడు. అదే సమయంలో గోపాలపురంలో ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన పార్ల‌మెంట్ స‌భ్యులు మార్గాని భరత్‌రామ్ దీనిని గ‌మ‌నించి.. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై తన వాహనాన్ని ఆపి, అక్క‌డ‌కు ప‌రుగుతీసి అత‌న్ని న‌దిలోకి దూక‌కుండా అడ్డుకున్నాడు. 

ఆయ‌న అనుచ‌రులు, ఆయ‌న క‌లిసి అత‌న్ని రోడ్డు మీద‌కు తీసుకువ‌చ్చారు. ఆ త‌ర్వాత రాజమహేంద్రవరం టూటౌన్‌ సీఐ గణేష్‌కు ఫోన్‌చేసి ఈ ఘ‌ట‌న గురించి వివ‌రించారు. యువకుడి రెండోపట్టణ పోలీసుస్టేషకు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వ‌నున్న‌ట్టు పోలీసులు తెలిపారు. కాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ చాకచక్యంగా యువకుడిని కాపాడినందుకు ఆయ‌న‌పై ప్ర‌శంస‌లజ‌ల్లు కురుస్తోంది.

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: జనసేన సభ్యుడు కుటుంబాన్నిపరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ | Asianet Telugu