వైఎస్ జగన్ కు బిగ్ షాక్ ... శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ రాజీనామా 

Published : May 14, 2025, 09:22 AM IST
వైఎస్ జగన్ కు బిగ్ షాక్ ... శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ రాజీనామా 

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా చేసారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 

YSR Congress Party : పుండు మీద కారం చల్లినట్లుగా తయారయ్యింది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది... 150 సీట్ల నుండి 11 సీట్లకు వైసిపి బలం పడిపోయింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కడంలేదు. ఈ ఓటమిని మరిచిపోకముందే వైసిపికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. 

తాజాగా వైసిపి ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానం రాజీనామా చేసారు. వైసిపితో పాటు ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేసారు. తన వ్యక్తిగత సిబ్బందితో రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపించారు. ఆమె రాజీనామాను ఛైర్మన్ ఆమోదిస్తే మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవిని కూడా కోల్పోతారు. 

జకియా ఖానం అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందినవారు. వైసిపి అధికారంలో ఉండగా 2020లో ఆమెను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసారు. ఆ తర్వాత 2021 లో ఆమె  మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇటీవల వైసిపి అధికారాన్ని కోల్పోయాక పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా జకియా ఖానం పార్టీకి, పదవికి రాజీనామా చేసారు. 

అధికారాన్ని కోల్పోయాక వైసిపి నాయకులు ఒక్కోక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు... చివరకు పార్టీలో జగన్ తర్వాత స్థానం అతడిదే అని చెప్పుకునే విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు కూడా వైసిపిని వీడగా తాజాగా డిప్యూటీ ఛైర్ పర్సన్ కూడా రాజీనామా చేసారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు వైసిపి వీడతారంటూ ప్రచారం జరుగుతోంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం