చంద్రబాబు కుట్రను జూ.ఎన్టీఆర్ పసిగట్టారు: రోజా

Published : Dec 12, 2018, 11:13 AM IST
చంద్రబాబు కుట్రను జూ.ఎన్టీఆర్ పసిగట్టారు: రోజా

సారాంశం

 నందమూరి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు సమాధి చేయాలనుకొన్నారని వైసీపీ ఎమ్మెల్యే  రోజా ఆరోపించారు.


అమరావతి: నందమూరి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు సమాధి చేయాలనుకొన్నారని వైసీపీ ఎమ్మెల్యే  రోజా ఆరోపించారు.

బుధవారం నాడు  ఆమె  మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై  ఆమె స్పందించారు.ఈ ఎన్నికల్లో  టీడీపీకి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణ ప్రజలు మంచి బుద్ది చెప్పారన్నారు.

చంద్రబాబునాయుడు కుట్రను జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ గుర్తించారని  రోజా అభిప్రాయపడ్డారు. అందుకే  వీరిద్దరూ కూడ జాగ్రత్త పడ్డారని రోజా చెప్పారు.
కూకట్‌పల్లిలో సుహాసిని పోటీకి దింపి నందమూరి  కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని చంద్రబాబునాయుడు ప్రయత్నించారని రోజా విమర్శలు గుప్పించారు.

కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో  టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని టీఆర్ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. సుహాసిని తరపున  ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాలేదు. బాలకృష్ణ, తారకరత్న మాత్రమే ప్రచారాన్ని నిర్వహించారు.

సంబంధిత వార్తలు

లగడపాటి సన్యాసం తీసుకోవాల్సిందే: రోజా వ్యాఖ్యలు

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu