వైఎస్ వివేకానందరెడ్డి హత్య: రంగంలోకి దిగిన సిట్

By Nagaraju penumalaFirst Published Mar 16, 2019, 2:57 PM IST
Highlights

కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం నలుగురిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానంద పీఏ కృష్ణారెడ్డి, ముఖ్య అనుచరుడు గంగిరెడ్డి, వంటమనిషి లక్ష్మమ్మ, డ్రైవర్ ప్రసాద్ లను సిట్ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసింది సిట్ దర్యాప్తు సంస్థ. కడప అడిషనల్ ఎస్పీ బి.లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం వైఎస్ వివేకానంద రెడ్డి నివాసం చేరుకున్నారు. 

కేసుకు సంబంధించి వివరాలను శుక్రవారం సేకరించిన సిట్ దర్యాప్తు సంస్థ శనివారం దర్యాప్తును వేగవంతం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం నలుగురిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానంద పీఏ కృష్ణారెడ్డి, ముఖ్య అనుచరుడు గంగిరెడ్డి, వంటమనిషి లక్ష్మమ్మ, డ్రైవర్ ప్రసాద్ లను సిట్ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

వైఎస్ వివేకానందరెడ్డి లేఖ రాశారంటూ లభ్యమైన లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. డ్రైవర్ ప్రసాద్ చంపేస్తున్నాడు అంటూ వైఎస్ వివేకానందరెడ్డి రాసిన లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైఎస్ వివేకా ఎందుకు ప్రసాద్ పేరున లేఖ రాశారు అన్న కోణంలో పోలీసులు కేసు విచారిస్తున్నారు.
 

click me!