టికెట్ ఇవ్వకుంటే.. భూమా బ్రహ్మానంద షాకింగ్ కామెంట్స్

By ramya NFirst Published Mar 16, 2019, 2:20 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే 126మందితో కూడిన తొలిజాబితాను విడుదల చేశారు. 


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే 126మందితో కూడిన తొలిజాబితాను విడుదల చేశారు. కాగా.. ఆ జాబితాలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అభ్యర్థిగా మంత్రి భూమా అఖిలప్రియ పేరును ఖరారు చేశారు. కానీ. నంద్యాల మాత్రం పెండింగ్ లో పెట్టారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరపునుంచి భూమా బ్రహ్మనంద రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అయితే.. ఆయనకు తిరిగి ఈ 2019 ఎన్నికల్లో టికెట్ ఇస్తారో లేదో అన్న విషయంలో  క్లారిటీ లేదు. మొదటి జాబితాలో నంద్యాల పేరు లేకపోవడంతో.. దీనిపై ఉత్కంఠ మరింత పెరిగింది.

కాగా.. దీనిపై భూమా బ్రహ్మానంద తాజాగా మీడియాతో మాట్లాడారు. తనకు కచ్చితంగా రెండో జాబితాలో చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాల టికెట్ తనకే కేటాయిస్తారని చెప్పారు. ఒక వేళ అలాకాదని.. తనకు టికెట్ ఇవ్వకుంటే.. భూమా నాగిరెడ్డి,చంద్రబాబు ఫోటోలతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని భూమా బ్రహ్మానంద  క్లారిటీ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే ఈసారి నంద్యాల టికెట్ తనకివ్వాలని ఏవీ సుబ్బారెడ్డి.. తన అల్లుడికే నంద్యాల టికెట్ ఇవ్వాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.మరి చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

click me!