Viral Video : రెండో భార్య, కొడుకుతో వైఎస్ వివేకా సరదా సరదాగా ... వైఎస్ సునీతకు కౌంటర్..!

Published : Apr 18, 2024, 10:45 AM ISTUpdated : Apr 18, 2024, 11:08 AM IST
Viral Video : రెండో భార్య, కొడుకుతో వైఎస్ వివేకా సరదా సరదాగా ...  వైఎస్ సునీతకు కౌంటర్..!

సారాంశం

గత ఐదేళ్లుగా మాజీ మంత్రి, సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్యచేసారు అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.  తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర వీడియో బయటకు వచ్చింది...

కడప : ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమి మధ్య ఈసారి హోరాహోరీ తప్పేలా లేదు. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాయి. అయితే కీలకమైన ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలతో కాదు సొంత కుటుంబసభ్యులతోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పోరు తప్పడంలేదు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం, బాబాయ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుపై సునీత న్యాయపోరాటం జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు షర్మిల కడప లోక్ సభలో పోటీకి సిద్దమవడం, ఆమెకు వైఎస్ సునీత మద్దతుగా నిలవడంతో వైసిపి బలంగా వున్న కడపలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి.

ఇలా కుటుంబసభ్యులే ప్రత్యర్థులుగా మారి వైఎస్ జగన్ పొలిటికల్ గా ఎదిరిస్తున్న వేళ ఓ ఆసక్తికరమైన వీడియో బయటకు వచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య, కొడుకుతో సరదాగా గడుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. కొడుకును ముద్దాడుతూ తానే స్వయంగా ఆడిస్తూ కనిపించారు. వివేకా రెండో భార్యతో కూడా వివేకా సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. 

ఇప్పుడే ఈ వీడియో ఎందుకు బయటకువచ్చింది? 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు ఈ ఎన్నికల్లో వైసిపిని డ్యామేజ్ చేసేలా వుంది. తన తండ్రిని కడప వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి, అతడి తండ్రి భాస్కర్ రెడ్డి చేయించారని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. ఆమె ఆరోపణలే నిజం అనేలా ఈ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది... అవినాష్ ను కూడా పలుమార్లు విచారించి అరెస్ట్ కు కూడా సిద్దమయ్యింది. కానీ హటాత్తుగా అవినాష్ అరెస్ట్ విషయంలో సిబిఐ వెనక్కితగ్గింది. దీంతో తన అన్న వైఎస్ జగనే నిందితుడైన అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడని సునీత ఆరోపిస్తున్నారు. ఇలా సొంత బాబాయ్ ని చంపిన నిందితుల పక్షాన నిలిచి ఇంటి ఆడబిడ్డకు అన్యాయం చేస్తున్నారని... అలాంటి వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని సునీత మండిపడుతోంది. కాబట్టి ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ఓటు వేయవద్దని రాష్ట్ర ప్రజలను సునీత కోరుతున్నారు. 

అంతేకాదు కడప లోక్ సభలో వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తానంటున్న సోదరి షర్మిలకు సునీత మద్దతుగా నిలిచారు. ఆమె తరపున ప్రచారం కూడా చేస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన సునీత పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తన తండ్రి హత్యతో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఏమిటి? వారితో  తన తండ్రికున్న విబేధాలు ఏమిటి? అన్నది వివరిస్తూ కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. తన తండ్రి రెండో పెళ్లి గురించి తెలియదని వైఎస్ సునీత తెలిపారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివేకా రెండో భార్య, కొడుకుతో వున్న వీడియోలు బయటకు రావడానికి కారణమయి వుంటాయి.

 

వైఎస్ వివేకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ :

ఎవరు బయటపెట్టారో తెలియదుగానీ వైఎస్ వివేకానందరెడ్డి ఓ మహిళతో సన్నిహితంగా వుంటూ అబ్బాయితో ఆడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. వాళ్లు ఆయన రెండో భార్య, కొడుకుగా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతూ వైరల్ గా మారాయి. ముఖ్యంగా వైసిపికి సంబంధించిన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ వీడియోలపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలోనే మీడియా ముందుకు వివేకా రెండో భార్య... మరి ఇప్పుడు వీడియోలు రాజకీయాల కోసమేనా..: 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై తనపై కూడా ఆరోపణలు రావడంతో ఆయన రెండో భార్యగా పేర్కొంటున్న షమీమ్ గతంలోనే మీడియా ముందుకు వచ్చారు. తనకు వివేకాతో 2010 లోనే వివాహం అయినట్లు... 2015 లో సంతానం కలిగినట్లు ఆమె తెలిపారు. తన కొడుకు పేరు షహన్షాగా షమీమ్ తెలిపారు. తన తండ్రికి దూరంగా వుండాలని వైఎస్ సునీత పలుమార్లు బెదిరించిందని షమీమ్ తెలిపారు. వైఎస్ వివేకా ఆస్తిపై  కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ కు ఆశ వుండేదని... తన కొడుకు వల్ల ఎక్కడ ఆ ఆస్తి దక్కదోనని భయపడేవారని అన్నారు. ఇలా ఆస్తికోసమే భర్తతో కలిసి సునీత ఏదైనా ఘోరానికి పాల్పడిందేమో అనేలా షమీమ్ కామెంట్స్ చేసారు.

కానీ తాజాగా ఈ షమీమ్ ఎవరో తనకు తెలియదని... అసలు తండ్రికి రెండో పెళ్లి గురించి తనకేమీ తెలియదన్నారు సునీత. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా రెండో భార్యతో కలిసి కొడుకుతో ఆడుకుంటున్న వీడియో భయటకు వచ్చింది. ఎన్నికల వేళ రాజకీయ లబ్ది కోసమే వైసిపి వాళ్లు ఈ వీడియోను బయటపెట్టివుంటారని అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu