వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సీబీఐ విచారణకు హాజరైన సోదరుడుసుధీకర్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 8, 2021, 1:23 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన సోదరుడు వైఎస్ సుధీకర్ రెడ్డి  ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యారు. 2019 మార్చి మాసంలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. 94 రోజులుగా వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారనే విషయమై సీబీఐ ఆరా తీస్తోంది.

కడప: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు వివేకానందరెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డి బుధవారం నాడు హాజరయ్యారు.2019 మార్చిలో మాసంలో ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు గాను అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. కడప కేంద్రంగా చేసుకొని సీబీఐ అధికారులు 94 రోజులుగా విచారణ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ కేసులో నిందితులను గుర్తించలేదు. 

అయితే హత్యకు ఉపయోగించినట్టుగా బావిస్తున్న ఆయుధాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను సీబీఐ గతంలో సీజ్ చేసినట్టుగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో హంతకులను పట్టిస్తే నజరానాను ఇస్తామని కూడ సీబీఐ ప్రకటించడం చర్చకు దారితీసింది.

ఈ కేసులో పలువురు అనుమానితులతో పాటు వివేకానందరెడ్డి సోదరులను కూడ విచారించింది. ఇవాళ  వివేకానందరెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డిని సీబీఐ విచారించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సమాచార సేకరణలో భాగంగానే సుధీకర్ రెడ్డిని విచారిస్తున్నట్టుగా సమాచారం.

click me!