ఏపీ ప్రభుత్వం ఈ గెజిట్ ద్వారా ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. జీవోఐఆర్ వెబ్‌సైట్ ను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విషయమై విపక్షాలు ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించాయి.
అమరావతి: ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ గెజిట్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ ప్రభుత్వం జీవోలను రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు జీవోఐఆర్ వెబ్‌సైట్ ను నిలిపివేసింది ఏపీ సర్కార్. ఈ విషయమై టీడీపీ సహ విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది.
సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉంచాలని నిర్ణయం తీసుకొన్నారు.అవసరం లేని వ్యక్తిగత సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, ఆదాయం, సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను ఇందులో పొందుపర్చబోమని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.