వైఎస్ వివేకాహత్య కేసు: సీబీఐ అధికారులతో సునీత భేటీ

By narsimha lodeFirst Published Aug 18, 2021, 12:58 PM IST
Highlights

సీబీఐ అధికారులతో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత  బుధవారం నాడు కడపలో భేటీ అయ్యారు. ఈ హత్య కేసుకు సంబంధించి ఆమె సీబీఐ అధికారులతో చర్చించారని సమాచారం.  73 రోజులుగా వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది.

కడప: సీబీఐ అధికారులతో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత బుధవారం నాడు భేటీ అయ్యారు. గత 73 రోజులుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవాళ సునీత సీబీఐ అధికారులను కలిసి ఈ హత్య కేసు కు సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా అని ఆరా తీశారని సమాచారం. ఈ విషయమై తన అనుమానాలను కూడ ఆమె సీబీఐ వద్ద ప్రస్తావించారని ప్రచారం సాగుతోంది.

బుధవారం నాడు కడపలో సునీల్ యాదవ్ సమీప బంధువు భరత్ యాదవ్ ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.  పులివెందులకు చెందిన మహబూబ్‌బాషా, నాగేంద్రతో సహా హత్యకేసులో అనుమానితుడిగా ఉన్న మరో వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని కూడా ఇవాళ సీబీఐ విచారించనుంది. 2019 మార్చి 14వ తేదీన రాత్రి ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసిన నిందితులను ఇంతవరకు  గుర్తించలేదు.

click me!