వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 6 నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారంనాడు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఈ విషయమై కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. దీంతో విచారణను ఇవాళ మధ్యాహ్ననికి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రి జయప్రకాష్ రెడ్డి ద్వారా వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి బ్యాండేజీ కట్టించారని సీబీఐ ఆరోపిస్తుంది. ఉదయ్ కుమార్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున , అంతకముందు ఎక్కడెక్కడ ఉన్నాడనే విషయాలపై కూడా సీబీఐ అధికారులు ఆరా తీశారు. వివేకానందరెడ్డి హత్యకు ముందు ఉదయ్ కుమార్ రెడ్డి సెలవులు పెట్టాడా అనే విషయమై కూడా సీబీఐ అధికారులు ఆరా తీశారు.
undefined
also read:చెప్పినట్టు వినాలని సీబీఐ అధికారి కొట్టారు: వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలనం
గతంలో కూడా ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. కానీ ఏప్రిల్ 14న సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.గతంలో కూడా ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. కానీ ఏప్రిల్ 14న సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన రెండు రోజులకే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ లోపుగా కేసు విచారణను ముగించేందుకు సీబీఐ ప్రయత్నిస్తుంది.