వైఎస్ వివేకా హత్య కేసు: నిందితులను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు

Published : Apr 28, 2023, 11:20 AM ISTUpdated : Apr 28, 2023, 11:29 AM IST
 వైఎస్ వివేకా హత్య  కేసు: నిందితులను కోర్టులో హాజరుపర్చిన  సీబీఐ అధికారులు

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు నిందితులను  సీబీఐ అధికారులు  ఇవాళ  కోర్టులో హాజరుపర్చారు.  

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు నిందితులను  సీబీఐ అధికారులు  శుక్రవారంనాడు  సీబీఐ  కోర్టులో హాజరుపర్చారు. మరో వైపు ఈ కేసులో  ఏ1 నిందితుడిగా  ఉన్న ఎర్ర గంగిరెడ్డి  కూడా  సీబీఐ కోర్టుకు  వచ్చారు. వివేకా హత్య  కేసు విచారణ  నేపథ్యంలో నిందితులను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి   హత్య  కేసులో  హైద్రాబాద్ జైలులో  ఉన్న ముగ్గురు నిందితులను  సీబీఐ అధికారులు  నాంపల్లి సీబీఐ  కోర్టులో హాజరుపర్చారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి,   ఉమాశంకర్ రెడ్డి , సునీల్ యాదవ్ లను  సీబీఐ అధికారులు  నాంపల్లి కోర్టులో  హాజరుపర్చారు. మరో వైపు  ఈ కేసులో  బెయిల్ పై  ఉన్న  ఎర్ర గంగిరెడ్డి  కూడా  ఇవాళ  సీబీఐ  కోర్టుకు  హాజరయ్యారు.  నిన్ననే  ఎర్రగింగిరెడ్డి  బెయిల్ ను  తెలంగాణ హైకోర్టు  రద్దు చేసింది.  ఈ ఏడాది మే  5 లోపుగా  సీబీఐ కోర్టులో లొంగిపోవాలని  ఎర్ర గంగిరెడ్డిని తెలంగాణ హైకోర్టు  నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే.

2019  మార్చి  14వ  తేదీ  రాత్రి  పులివెందులలో  వైఎస్ వివేకానందరెడ్డి  హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది.  ఈ కేసు దర్యాప్తును ఈ ఏడాది జూన్  30వ తేదీ లోపుగా  పూర్తి చేయాలని   ఇటీవలనే  సుప్రీంకోర్టు  ఆదేశించింది.  ఈ కేసు దర్యాప్తును  సీబీఐ మరింత వేగవంతం చేసింది

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్