తల రెండు ముక్కలు: ఏలూరులో భార్యను హత్య చేసిన భర్త

Published : Apr 28, 2023, 10:19 AM IST
తల రెండు ముక్కలు: ఏలూరులో భార్యను హత్య  చేసిన భర్త

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా  వీరంపాలెంలో  దారుణం చోటు  చేసుకుంది.  భార్యను అత్యంత దారుణంగా  హత్య చేశాడు  నిందితుడు .

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరంపాలెంలో  భార్యను అత్యంత దారుణంగా హత్య  చేశాడు  భర్త.  భార్య మృతదేహన్ని ముక్కలుగా  కోశాడు.  ఇటీవలనే  నిందితుడు  జైలు నుండి విడుదలయ్యాడు. జైలు  నుండి  బయటకు వచ్చిన తర్వాత  నిందితుడు  భార్యను అత్యంత  దారుణంగా  హత్య  చేశాడు. 

పశ్చిమగోదావరి  జిల్లా వీరంపాలెంలో  భార్య నిర్మలను అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త   గంజి దావీదు.  నిర్మల మెడ కోశాడు. తలను రెండు ముక్కలు చేశాడు.  నిర్మల  చేయిని  కట్ చేసి మరో చేతిలో పెట్టాడు.  ఈ విషయమై  పోలీసులకు సమాచారం అందింది.  తాడేపల్లి రూరల్ పోలీసులు  సంఘటన స్థలాన్ని  పరిశీలించారు.  నిర్మల డెడ్ బాడీని  పోస్టుమార్టం కోసం తరలించారు.   భార్య నిర్మలపై  కోపంతో  గతంలో  కూతుళ్లకు  దావీదు  నరకం చూపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.  గతంలో   నమోదైన  కేసులో  దావీదు  జైలుకు వెళ్లాడు. ఇటీవలనే  జైలు నుండి విడుదలయ్యాడు.  జైలు నుండి బయటకు వచ్చినా కూడా  దావీదు  ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్య నిర్మలపై  అనుమానంతో  దావీదు  ఆమెను హత్య చేసినట్టుగా   పోలీసులు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్