YS Vivekananda Reddy Murder Caseలో ట్విస్ట్: సీబీఐ అధికారి రామ్‌సింగ్ పై కేసు

Published : Feb 23, 2022, 10:18 AM ISTUpdated : Feb 23, 2022, 10:22 AM IST
YS Vivekananda Reddy Murder Caseలో ట్విస్ట్: సీబీఐ అధికారి రామ్‌సింగ్ పై కేసు

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసులో తనను సీబీఐ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని కోర్టులో ఉదయ్ కుమార్ రెడ్డి పిటిషన్ పై కోర్టు ఆదేశాల మేరకు రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

కడప:  మాజీ మంత్రి YS vivekananda Reddy హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసు విచారణ చేస్తున్న CBI అధికారి Ram Singh పై కడప RIMS పోలీస్ స్టేషన్ లో Case నమోదైంది. Courtఆదేశం మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పేరుతో తనను  సీబీఐ అధికారులు వేధిస్తున్నారని పులివెందుల బాకరాపురానికి చెందిన Uday Kumar Reddy ఫిర్యాదు చేశారు.  ఈ నెల 15న ఏఆర్‌ అదనపు ఎస్పీ Mahesh Kumar ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

తాము చెప్పినట్లు వినాలని వేధించడంతో పాటు తనను మానసిక, శారీరక ఇబ్బందులు పెడుతున్నట్లు  సీబీఐపై ఆయన ఆరోపించారు. అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని చెబుతూ ఉదయ్ కుమార్ రెడ్డి  Kadapa కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  దీంతో  కేసు నమోదు చేయాలని ఈ నెల 18న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై ఐపీసీ 195ఏ, 323, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద రిమ్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 

2019 మార్చి మాసంలో వైఎస్ వివేకానందరెడ్డిని స్వగృహంలోనే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసు విచారణను  సీబీఐ చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అప్రూవర్ గా మారుతున్నట్టు దస్తగిరి ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు వేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.  దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల తరఫు వాదనలను తోసిపుచ్చింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఖరారు చేసింది. చట్టప్రకారం సీబీఐ ముందుకెళ్లొచ్చని తెలిపింది. 

 వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను  దస్తగిరి సిబిఐ అధికారులకు  ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని Umashankar Reddy   తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, Sunil Yadav, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు దస్తగిరి  ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.

సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్