నా తండ్రిని చంపిన వారి నుండి ప్రాణ ముప్పు: డీజీపీకి వివేకా కూతురు లేఖ

By narsimha lodeFirst Published Jan 30, 2020, 10:42 AM IST
Highlights

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి లేఖ రాశారు. తనకు ప్రాణ భయం ఉందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. 

అమరావతి: తన తండ్రిని చంపిన హంతకుల నుండి తనతో పాటు తన భర్త ప్రాణాలకు కూడ ముప్పు ఉందని దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆమె కోరారు.

also read:వివేకా హత్యకేసుతో జనంలోకి... జగన్ పాత్రపై అనుమానం..: బుద్దా వెంకన్న

మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని సునీత ఇటీవలనే ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ పిటిషన్‌లో ఆమె కొందరి పేర్లను కూడ ప్రస్తావించింది. 

read more   జగన్ పాలన మరో ఏడాదే... ఆ తర్వాత జైలుకే...: దేవినేని ఉమ సంచలనం

ఏపీ రాష్ట్రంలో తాము పర్యటించిన సమయంలో తమకు సాయుధులైన పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతూ డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు.గత ఏడాది నవంబర్ 21వ తేదీన ఆమె డీజీపీకి లేఖ రాశారు.రెండు రోజుల క్రితం ఏపీ హైకోర్టులో తన తండ్రి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌తో పాటు ఏపీ డీజీపీకి రాసిన లేఖ ప్రతిని కూడ సునీతారెడ్డి హైకోర్టుకు అందించారు. 2019 మార్చి 15వ తేదీన తండ్రిని అత్యంత దారుణంగా ఇంట్లోనే హత్య చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

ఈ కేసు విచారణ సమయంలో తనతో పాటు తన భర్త కూడ పోలీసులకు సహకరిస్తున్నట్టుగా ఆమె ఆ లేఖలో గుర్తు చేశారు  అయితే ఈ కేసులో ఇంతవరకు నిందితులను కనిపెట్టలేకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ పరిస్థితుల్లో తన కుటుంబం భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆమె ప్రస్తావించారు.

 ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, రంగయ్యల ప్రాణాలకు కూడ ముప్పు ఉందనే ఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆ లేఖలో తన అనుమానాలను వ్యక్తం చేశారు.  ఈ లేఖలను కడప ఎస్సీ  కార్యాలయంలో కూడ అందించినట్టుగా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

 

 

click me!