జగన్ పై సొంత సోదరికే నమ్మకంలేదు... చింతమనేని

Published : Jan 30, 2020, 08:23 AM ISTUpdated : Jan 30, 2020, 08:43 AM IST
జగన్ పై సొంత సోదరికే నమ్మకంలేదు... చింతమనేని

సారాంశం

తనకు  నచ్చనివన్నీ సీఎం రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యీలు అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజులను నేతలు సత్కరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై  టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు. తనకు  నచ్చనివన్నీ సీఎం రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యీలు అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజులను నేతలు సత్కరించారు.

AlsoRead సెలక్ట్ కమిటీ ఏర్పాటులో ట్విస్ట్: వైసీపీ కొత్త వాదన...

ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. మూర్ఖపు ఆలోచనలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు.  జగన్ పై సొంత సోదరికే నమ్మకం లేకపోతే ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం