వివేకా హత్య కేసు.. ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగింపు..

Published : Jun 16, 2023, 02:09 PM IST
 వివేకా హత్య కేసు.. ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగింపు..

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఈరోజు సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఈరోజు సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. ఈ ఆరుగురు నిందితుల్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. అయితే విచారణ సందర్భంగా ఆరుగురు నిందితుల రిమాండ్‌ను ఈ నెల 30 వరకు పొడిగించింది. తదుపరి విచారణను కూడా ఈ నెల 30కు వాయిదా వేసింది. దీంతో నిందితులను అధికారులు తిరిగి చంచల్ ‌గూడ జైలుకు తరలించారు. 

Also Read: చంచల్‌గూడ జైలులో వైఎస్ భాస్కర్ రెడ్డిని కలిసిన ఆయన కొడుకు అవినాష్ రెడ్డి

ఇదిలా ఉంటే.. మరోవైపు ఈ కేసులో అవినాష్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు అవినాష్ రెడ్డిని  ప్రశ్నించింది. అయితే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు విధించిన షరతుల మేరకు.. అవినాష్ రెడ్డి శనివారం రోజున సీబీఐ విచారణకు హాజరవుతూ వస్తున్నారు. అయితే తాజాగా సీబీఐ ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఏ-8గా పేర్కొంది. 
 

PREV
click me!

Recommended Stories

Navratri Celebrations: బెజవాడలో రాగా దాండియా ఉత్సవ్ 2.0.. ఘనంగ నవరాత్రి వేడుకలు
చంద్రబాబు వేసే బిస్కెట్లకు కక్కుర్తి పడకండి | YS Jagan On AP Police | AP Localbody Elections 2026