మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు గురువారం నాడు నోటీసులు జారీ చేసింది.
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ హైకోర్టు గురువారం నాడు నోటీసులు జారీ చేసింది.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ సెక్రటరీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
also read:వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: పరమేశ్వర్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్సీ భేటీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సిట్ విచారిస్తోంది. ఈ హత్య జరిగిన సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.
Also read: వైఎస్ వివేకా హత్య: హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరో వైపు ఈ కేసు విచారణను సిట్ మరింత వేగవంతం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతించాలని కోరుతూ సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేదని పరమేశ్వర్ రెడ్డి కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధానంగా ప్రస్తావించింది. జగన్ పై ఆ నాడు చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. చంద్రబాబునాయుడు విమర్శలపై వైసీపీ కూడ ఎదురు దాడికి దిగింది.
అయితే ఈ విషయమై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు హైకోర్టును ాశ్రయించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయమై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని హైకోర్టు ఆ సమయంలో ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం కూడ ఈ కేసును కూడ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీకి చెందిన నేతలను విచారించింది.
మరికొందరు అనుమానితులను కూడ సిట్ విచారణ చేయనుంది. ఈ తరుణంలో ీ కేసు విషయమై ఏపీ హైకోర్టు గురువారం నాడు చంద్రబాబుకు నోటీసులుు జారీ చేసింది.