తప్పిన ప్రమాదం: వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం, సురక్షితంగా బయటపడిన విజయమ్మ

By narsimha lodeFirst Published Aug 11, 2022, 1:30 PM IST
Highlights


వైఎస్ విజయమ్మ ప్రయాణీస్తున్న కారుకు ప్రమాదం చోటు చేసుకుంది అనంతపురం నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న  వైఎస్ విజయమ్మ కారు   గుత్తికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. కారు టైర్లు రెండు పేలడంతో ప్రమాదం జరిగింది.

కర్నూల్: ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కు తృటిలో ప్రమాదం తప్పింది. విజయమ్మ ప్రయాణీస్తున్న కారు టైరు పేలింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ ప్రమాదంలో విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడు అయ్యప రెడ్డిని పరామర్శించి  వైఎస్ విజయమ్మ వెళ్తున్న సమయంలో గురువారం నాడు కర్నూల్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  కర్నూల్ జిల్లాలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో విజయమ్మ ప్రయాణీస్తున్న కారు రెండు టైర్లు పేలిపోయాయి.

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పేలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆమె క్షేమంగా బయటపడ్డారు. pic.twitter.com/YL7xbgqLTg

— Asianetnews Telugu (@AsianetNewsTL)

దీంతో కారు అదుపు తప్పింది.దీంతో ఈ విషయాన్ని గమనించిన కారు డ్రైవర్ అతి కష్టం మీద కారును అదుపు చేశాడు.  ఈ విషయం తెలిసిన స్థానికులు వైఎస్ విజయమ్మకు మరో కారును ఏర్పాటు చేశారు. దీంతో మరో కారులో వైఎస్ విజయమ్మ అక్కడి నుండి వెళ్లిపోయారు.  

అనంతపురం జిల్లాలోని అయ్యప్పరెడ్డిని వైఎస్ విజయమ్మతో పాటు మరికొందరు పరామర్శించారు. అయ్యప్పరెడ్డిని పరామర్శించి వైఎస్ విజయమ్మ కారులో హైద్రాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. కర్నూల్ జిల్లా గుత్తి వద్దకు విజయమ్మ కారు చేరుకోగానే కారు రెండు టైర్లు పేలిపోయాయి. దీంతో కారు అదుపు తప్పింది. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపు చేశాడు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది.  అయితే ఈ కారులో ప్రయాణిస్తున్న వైఎస్ విజయమ్మ  సహా మిగిలినవారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు.


 

click me!