గోదావరికి పోటెత్తిన వరద: ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

By narsimha lode  |  First Published Aug 11, 2022, 9:52 AM IST

గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నది 14 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీకిక 10 లక్షలకు పైగా వరద వచ్చి చేరుతుంది.ఈ వరదను సముదరంలోకి విడుదలకు విడుదల చేస్తున్నారు.


హైదరాబాద్: Godavari నదికి వరద పోటెత్తింది.దీంతో Dowleswaram బ్యారేజీకి 10.19 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్టుగానే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.  ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది 14 అడుగులకు చేరింది.దీంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో  గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  Andhra Pradesh తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది జూలై మాసంలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 

Latest Videos

also read:గోదావరి, శబరి నదులకు పోటెత్తిన వరద: మూడు రాష్ట్రాలకు రాకపోకలు బంద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో గోదావరి వరద నీరు కాజ్ వేల పై నుండి ప్రవహిస్తుంది. కోనసీమలోని సుమారు 40 గ్రామాలకు వరద కారణంగా రాకపోకలు బందయ్యాయి.మరో వైపు విలీన మండలాల్లోని సుమారు 200 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద పోటెత్తిన కారణంగా  పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను  సిద్దం చేశారు.మొత్తం ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్  బృందాలు సహాయక చర్యలకు సిద్దంగా ఉంచింది ప్రభుత్వం.

అల్లూరి జిల్లాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది.దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.  కూనవరం వద్ద గోదావరి నది 53 అడుగులకు చేరింది. చింతూరు వద్ద శబరి నది 51 అడుగులకు చేరింది.  దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. 

ప్రమాద హెచ్చరికలను దాటి గోదావరి, నదులు ప్రవహిస్తున్నాయి.  గోదావరి నదికి జూలై మాసంలో  వందేళ్ల ఏళ్లలో రాని వరద వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. 1986 లో వచ్చిన రికార్డు స్థాయి వరద వచ్చింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రెండు రాష్ట్రాల్లో గోదావరి  పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.  సాధారణంగా ప్రతి ఏటా ఆగష్టు, సెప్టెంబర్ మాసాల్లో గోదావరి నదికి వరద వస్తుంది. కానీ జూలై మాసంలోనే వరద వచ్చింది. ఈ వరద నుండి కోలుకుంటున్న తరుణంలో మరోసారి వరదలు రావడంతో గోదావరి పరివాహక ప్రాంత  ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

click me!