పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలి: జగనన్న విద్యాదీవెన నిధులు రిలీజ్ చేసిన జగన్

By narsimha lode  |  First Published Aug 11, 2022, 12:17 PM IST

జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా మూడో విడత కింద నిధుల పంపిణీని సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు విడుదల చేశారు.  చంద్రబాబు సర్కార్ చేసిన అప్పుల కంటే తమ ప్రభుత్వం చేసిన అప్పులు చాలా తక్కువేనని ఆయన గుర్తుచేశారు. 


బాపట్ల: ప్రతి పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం విద్యారంగంపై డబ్బులు ఖర్చు పెడుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బాపట్లలోని  జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులను గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.మూడో విడత విద్యా దీవెన కింద రూ.694 కోట్ల నిధులను సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. సుమారు 11.02 లక్షల మంది విద్యార్ధులకు విద్యా దీవెన కింద లబ్ది చేకూరనుంది. 

ఈ సందర్భంగా బాపట్లలోని కాలేజీలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.రాష్ట్రంలోని ప్రతి భిడ్డ చదువుకోవాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం జగన్ చెప్పారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరనలు తీసుకొచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని తమ ప్రభుత్వం పీజు రీఎంబర్స్ మెంట్ ను అమలు చేస్తుందని సీఎం జగన్  చెప్పారు.  అందుకే ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఎంతైనా ప్రభుత్వం చెల్లిస్తుందని జగన్ చెప్పారు. ఒక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్ధులుంటే అంతమందిని చదివించాలని సీఎం జగన్ కోరారు.  చదువుకునే విద్యార్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ హమీ ఇచ్చారు. ప్రతి ఇంటి నుండి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐపీఎస్ లు కావాలన్నదే తన లక్ష్యమన్నారు.

Latest Videos

పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. విద్యా రంగంపై గత మూడేళ్లలో రూ. 53 వేల ఖర్చు పెట్టామని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యార్ధుల చదువు కోసం  పేదలు అప్పులపాలు కాకూడదనేది తమ ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఆయన వివరించారు.అమ్మఒడిలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్టుగా జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు పాలనకు, తన పాలనకు మధ్య వ్యత్యాసాన్ని చూడాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.  ఉచితంగా అక్కా చెల్లెళ్లకు డబ్బులు ఇస్తుంటే వెటకారంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పోతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందా అని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు సర్కార్ చేసిన అప్పుల కంటే తమ ప్రభుత్వం చేసిన అప్పులు చాలా తక్కువేనన్నారు.  అప్పుల్లో గతంలో గ్రోత్ రేటు 19 శాతం ఉంటే,ఇప్పుడు 15 శాతమేనని సీఎం జగన్ ప్రకటించారు. చంద్రబాబు సర్కార్ లో దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా పరిస్థితి ఉండేదని ఆయన ఎద్దేవా చేశారు. 
 

click me!